జవాబు:
1 - మోసం: వస్తువులో లోపాన్ని దాచడం వంటివి.
అబీ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన (అతనితో ఇలా అడిగారు: "ఓ ధాన్యపు కుప్ప యజమానీ, ఏమిటిది?" దానికి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: "ఓ రసూలుల్లాహ్, వర్షం పడింది (ధాన్యం వర్షంలో తడిసింది)" అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "ప్రజలు చూసేలా నీవు ధాన్యం గుట్టపై భాగాన ఈ తడిసిన ధాన్యాన్ని ఎందుకు ఉంచలేదు? మోసం చేసేవాడికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు." ముస్లిం హదీసు గ్రంధము
2 -రిబా (వడ్డీ): ఒకరి నుండి వెయ్యి అప్పుగా తీసుకుని, రెండు వేలు తిరిగి ఇవ్వడం.
ఈ అదనపు ధనం నిషేధిత వడ్డీగా పరిగణించబడుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వ్యాపారాన్ని ధర్మబద్ధం చేసాడు మరియు వడ్డీలను నిషేధించినాడు. [సూరతుల్ బఖరహ్: 275వ ఆయతు]
3 - ఘరర్ (అనిశ్చితి, అపాయము) మరియు జహాలహ్ (అజ్ఞానం): ఆడ గొర్రె పొదుగులో ఉన్న పాలను అమ్మడం లేదా ఇంకా పట్టుకోని చేపలను అమ్మడం వంటివి అంటే తన ఆధీనంలో లేని దానిని అమ్మడం అన్నమాట.
హదీస్ లో ఇలా పేర్కొనబడింది: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఘరార్ (అనిశ్చితి, అపాయం) లావాదేవీలను నిషేధించారు". ముస్లిం హదీసు గ్రంధము