2: ఈ ఐదు నియమాల గురించి వివరించండి?

జవాబు:

1 - అల్ వాజిబు: ఉదాహరణకు ఐదుపూటల సలాహ్ (నమాజులు), రమదాన్ మాసంలో నెల మొత్తం పాటించ వలసిన ఉపవాసాలు మరియు తల్లిదండ్రుల పట్ల విధేయత వంటివి.

- వాజిబ్ ఆచరణలు విధిగా అమలు చేసినందుకు ప్రతిఫలం లభిస్తుంది, కానీ వాటిని విడిచిపెడితే శిక్షలు ఉంటాయి.

2 - అల్ ముస్తహబ్: సాధారణ సున్నత్ సలాహ్ లు (నమాజులు), రాత్రి నమాజులు, ప్రజలకు భోజనం పెట్టడం మరియు శాంతి శుభాకాంక్షలు అభిలషిస్తూ సలాం చేయడం వంటివి. దీనిని "సున్నత్" మరియు "మందూబ్" అని కూడా అంటారు.

- ముస్తహబ్ ఆచరణలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది మరియు చేయకపోతే శిక్ష ఉండదు.

ముఖ్య గమనిక:

ముస్లింలు సున్నత్ లేదా ముస్తహబ్ ఆచరణలు చేసేందుకు త్వరపడాలి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉదాహరణలను అనుసరించాలి.

3 - అల్ ముహర్రమ్: ఉదాహరణకు మద్యం సేవించడం, తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ఉండటం మరియు బంధుత్వ సంబంధాలను తెంచుకోవడం వంటివి.

- నిషేధించబడిన వాటిని విడిచిపెట్టినందుకు పుణ్యాలు ప్రసాదించ బడతాయి, కానీ వాటికి పాల్పడితే శిక్షలు ఉంటాయి.

4 - అల్ మక్రూహ్: ఎడమ చేతితో తీసుకోవడం మరియు ఇవ్వడం మరియు నమాజులో వస్త్రం యొక్క దిగువ భాగాన్ని పైకి ఎత్తడం వంటివి.

- మక్రూహ్ పనులు (అయిష్టకరమైనవి) త్యజించినందుకు ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ వాటిని చేస్తే దానివలన శిక్షలు ఉండవు.

5 - అల్ ముబాహ్: ఆపిల్ తినడం మరియు టీ తాగడం వంటివి. దీనిని "జాయజ్" మరియు "హలాల్" అని కూడా అంటారు.

- అనుమతించబడిన వాటిని విడిచిపెట్టినందుకు ప్రతిఫలం ఉండదు, అది చేయడం వలన శిక్షలూ ఉండవు.