15: అత్తౌబహ్ (పశ్చాత్తాపం) యొక్క షరతులు ఏమిటి?

జవాబు: 1 - చెడుపనులు, పాపకార్యాలు విడిచి పెట్టడం

2 - చేసిన చెడుపనికి, పాపకార్యానికి పశ్చాత్తాపం చెందటం

3 - మరలా ఆ చెడుపనులు, పాపకార్యాలను చేయనని దృఢనిశ్చయం చేసుకోవడం

4 - ఒకవేళ ఆ చెడుపనిలో, పాపకార్యంలో ఇతరుల హక్కులు ఉల్లంఘించి ఉంటే వాటిని వాపసు చేయడం (దొంగిలించి ఉంటే దానిని అసలు యజమానికి వాపసు చేయడం).

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వారు, ఎవరైతే అశ్లీల పనులు చేసినా లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన తప్పులను బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు! సూరతు ఆలే ఇమ్రాన్ : 135 ఆయతు.