13: మానవుడి శత్రువులు ఎవరు?

1 - ఒకరిని చెడు వైపుకు ప్రేరేపించే మానవ ఆత్మ: ఇది ఒక వ్యక్తి తన ఆత్మ తనకు ఏది నిర్దేశిస్తుందో దానిని అనుసరించి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు అవిధేయత చూపడంలో అతని వ్యక్తిగత కోరికలను అనుసరించేలా చేసే ఆత్మ. పరమ పరిశుద్ధుడైన అల్లాహ్ ప్రకటన: వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది – నా ప్రభువు కరుణించిన వాడు తప్ప – నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత. [సూరతు యూసుఫ్ :53వ ఆయతు] 2 - షైతాను: అతడి ప్రధాన లక్ష్యం - మనిషిని తప్పుదారి పట్టించడం, అతనిని చెడు వైపు ప్రేరేపించడం మరియు నరకాగ్నిలోకి తీసుకెళ్లడం. షై’తాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు. [సూరతుల్ బఖరహ్: 168వ ఆయతు] 3 - చెడ్డ సహవాసులు: వారు చెడు వైపు ఒకరిని పురికొల్పేవారు మరియు మంచితనం నుండి అతన్ని నిరోధించేవారు. ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొరకు శత్రువులవుతారు. [సూరతుల్ జుఖ్'రుఫ్: 67వ ఆయతు]