19: ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చేసే జిక్ర్ (అల్లాహ్ ధ్యానం)లో ఏమి పలక వలెను?

జవాబు: 1 - ఆయతల్ కుర్సీ పఠనం : అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. [255] [సూరతుల్ బఖరహ్: 255వ ఆయతు] 2 - బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణాప్రధాత మరియు ఆపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో): {ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2) {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.} 3 {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} మూడుసార్లు. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్(a) పేరుతో(b) ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3 మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4 : అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 : మూడుసార్లు. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో, ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1) మానవుల చక్రవర్తి. (2) [2] మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)! 3 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; 4 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!5 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!6 మూడుసార్లు. 3 - ఓ అల్లాహ్ నీవే నా ప్రభువి. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. నీవే నన్ను పుట్టించావు. నేను నీ దాసుడును. నేను నీకు చేసిన వాగ్దానానికి, నీతో చేసుకున్న ఒప్పందమునకు, శాయశక్తులా కట్టుబడి ఉన్నాను. నేను చేసిన కర్మల కీడునుండి నీ శరణు కోరుతున్నాను. నాపై ఉన్న నీ అనుగ్రహాలను ఒప్పుకుంటున్నాను, నేను చేసిన పాపములను ఒప్పుకుంటున్నాను, కనుక నన్ను క్షమించు. ఎందుకనగా నీవు తప్ప పాపములను క్షమించేవాడెవడూ లేడు. బుఖారీహదీసు గ్రంధము