జవాబు: మొదటిది - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపడంలో సహనం.
రెండవది - పాపాలు మానుకోవడంలో చూపే సహనం.
మూడవది - కఠినమైన దైవాదేశాలను ఆచరణలో పెట్టడంలో చూపే సహనం మరియు అన్ని స్థితులలోనూ అల్లాహ్ నే స్తుతించడంలో చూపే సహనం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు అల్లాహ్ ఓర్పు గల వారిని ప్రేమిస్తాడు. 146 [సూరతు ఆలే ఇమ్రాన్ : 146వ ఆయతు] నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసి పరిస్థితి చాలా ఆశ్చర్యకరమైనది. అతను ఏ పరిస్థితిలో ఉన్నా అతనికి మేలు మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం విశ్వాసి విషయంలో మాత్రమే జరుగుతుంది. అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపు కుంటాడు, అతనికి అది మేలును ప్రసాదిస్తుంది. ఒక వేళ అతనికి కష్టం కలిగితే అతను సహనం వహిస్తాడు అది అతనికి మేలు చేస్తుంది. ముస్లిం హదీసు గ్రంధం