5: ఒక వ్యక్తి తన సోదరులు మరియు స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి?

జవాబు: 1 - మంచి వ్యక్తులను ప్రేమించాలి మరియు వారిని స్నేహితులుగా తీసుకోవాలి.

2 - చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి.

3 - తోటి సోదరులకు సలాం చేయాలి మరియు కరచాలనం చేయాలి.

4 - వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని సందర్శించాలి మరియు వారి అనారోగ్యం దూరం చేయమని అల్లాహ్ ను వేడుకోవాలి.

5 - తుమ్మిన వ్యక్తి కొరకు "యర్హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక) అని ప్రార్థించాలి.

6 - తమను సందర్శించమని పిలిచిన వారి ఆహ్వానాన్ని స్వీకరించాలి.

7 - వారికి అవసరమైనప్పుడు, మంచి సలహాలు ఇవ్వాలి.

8 - వారికి అన్యాయం జరిగినప్పుడు వారిని ఆదుకోవాలి మరియు ఇతరులను అణచియకుండా వారిని అడ్డుకోవాలి.

9 - స్వయంగా తన కోసం దేనిని ఇష్టపడతారో, దానినే ఇతరుల కొరకు కూడా ఇష్టపడాలి.

10 - అవసరమైనప్పుడు వారికి సహాయ సహకారాలు అందించాలి.

11 - మాటలతో, చేతలతో వారికి హాని కలిగించడం మానుకోవాలి.

12 - వారి రహస్యాలను గోప్యంగా ఉంచాలి.

13 - వారిని అవమానించడం, దూషించడం, తృణీకరించడం, వారి ఎదుగుదలను చూసి అసూయపడడం, వారిపై గూఢచర్యం చేయడం లేదా వారిని మోసం చేయడం వంటివి మానుకోవాలి.