19: సలాం చేయడంలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

జవాబు: 1 - ఒక ముస్లిమ్ ను కలిసినప్పుడు, "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" (అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు ఆశీర్వాదాలు మీపై ఉండుగాక) అని ప్రశాంతంగా పలకరించడంతో సంభాషణ ప్రారంభించాలి. సలాం చెప్పకుండా, కేవలం చేతితో సంజ్ఞ చేయడం మాత్రమే సరిపోదు.

2 - చిరునవ్వు ముఖంతో ఇతరులకు సలాం చేయండి.

3 - కుడిచేత్తో కరచాలనం చేయండి

4 - ఎవరైనా సలాం చేసినప్పుడు, దానికి సమానమైన పదాలతో లేదా దాని కంటే ఉత్తమంగా ఇంకా ఎక్కువ పదాలతో తిరిగి సలాం చేయండి.

5 - అవిశ్వాసిని కలుసుకున్నప్పుడు, అతనికి సలాం చెప్పడంతో ప్రారంభించకూడదు. అతను అభివాదం చేస్తే, అలాంటి పదాలతోనే అతనికి బదులు పలకాలి.

6 - యువకులు వృద్ధులకు సలాం చేయాలి, వాహనం మీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వారికి సలాం చేయాలి, నడుస్తున్న వారు, కూర్చున్నవారికి సలాం చేయాలి, కొద్దిమందితో ఉన్న బృందం, ఎక్కువ మంది ఉన్న పెద్ద బృందానికి సలాం చేయాలి.