16: ఇంటిలో ప్రవేశించే మరియు ఇంటి నుండి బయటికి వెళ్ళటంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

జవాబు: 1 - ఎడమ కాలు బయట పెట్టి, ఇంటి నుండి బయటకు అడుగు వేస్తూ ఇలా దుఆ చేయ వలెను: "బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మా ఇన్నీ అ'ఉదు బిక అన్ అదిల్ల అవ్ ఉదల్ల; అవ్ అజిల్ల, అవ్ ఉజల్ల, అవ్ అజ్'లిమ అవ్ ఉజ్'లమ; అవ్ అజ్'హల అవ్ ఉజ'హల అలయ్య" (అల్లాహ్ పేరుతో, నేను అల్లాహ్ పైనే ఆధారపడతాను మరియు అల్లాహ్లో తప్ప మరో దానిలో ఏ శక్తీ లేదా బలమూ లేదు. ఓ అల్లాహ్! నేను తప్పుదారి పట్టడం నుండి లేదా నన్ను ఎవరైనా తప్పుదారి పట్టించడం నుండి, నేను ఎవరినైనా అవమానించడం నుండి లేదా నన్ను ఎవరైనా అవమానించడం నుండి నేను ఎవరిపైనైనా దౌర్జన్యం చేయడం నుండి లేదా నాపై ఎవరైనా దౌర్జన్యం చేయడం నుండి, నేను అజ్ఞానంతో వ్యవహరించడం నుండి మరియు నాపై ఎవరైనా అజ్ఞానంతో వ్యవహరించడం నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.) 2 - కుడి పాదంతో ఇంట్లోకి ప్రవేశిస్తూ, ఇలా దుఆ చేయాలి: "బిస్మిల్లాహి వలజ్నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ ‘అలా రబ్బినా తవక్కల్నా” (అల్లాహ్ పేరుతో మేము ప్రవేశిస్తాము, అల్లాహ్ పేరుతో మేము బయటికి వెళతాము మరియు మా ప్రభువుపైనే మేము ఆధారపడతాము).

3 - మిస్వాక్ ఉపయోగిస్తూ (దంతాలు శుభ్రపరిచే పంటిపుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటూ ), ఇంట్లోని వ్యక్తులను సలాం చేస్తూ ఇంటిలోనికి ప్రవేశించవలెను.