జవాబు: ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘మేము మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాము, అపుడు అక్కడికి తెల్లటి దుస్తులు ధరించి, నల్లటి వెంట్రుకలు కలిగి, ఎటువంటి ప్రయాణ ప్రభావం కనిపించని ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతను నేరుగా వెళ్ళి మహనీయ ప్రవక్తకి దగ్గరగా ఆయన మోకాళ్ళకు మోకాళ్ళు ఆన్చి పెట్టి, తన చేతులు తొడలపై పెట్టుకుని కూర్చున్నాడు, పిదప "ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇస్లాం అంటే ఏమిటో నాకు బోధించండి?" అంటూ అడిగాడు. దానికి మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ బదులిస్తూ ‘ఇస్లాం అంటే ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు సందేశ హరుడని నీవు సాక్ష్యమివ్వటం, నమాజులు ఆచరించడం,(స్తోమత ఉంటే )జకాతు చెల్లించడం, రమదాన్’మాసపు ఉపవాసాలు పాటించడం, ఒకవేళ నీకు వెళ్లగలిగే శక్తి, స్తోమత ఉంటే హజ్జ్ యాత్ర చేయడం అని చెప్పారు. దానికి ఆ వ్యక్తి ‘ యదార్థం చెప్పారు’ అన్నాడు, మాకు ఆవిషయం ఆశ్చర్యం కలిగించింది అతను ప్రశ్నిస్తున్నాడు తరువాత జవాబును కూడా దృవీకరిస్తున్నాడే! మళ్ళీ ప్రశ్నిస్తూ ‘నాకు ఈమాన్ అంటే ఏమిటో చెప్పండి అని అడిగాడు, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘అల్లాహ్ ను, దైవదూతలను, ఆకాశ గ్రంధాలను, ప్రవక్తలను, మరియు పరలోకదినాన్ని నీవు విశ్వసించాలి, దాంతో పాటు విధివ్రాత మంచి ఐనా మరియు చెడుఐనా ను విశ్వసించాలి, అని చెప్పారు. అతను ‘యదార్ధం చెప్పారు మీరు అన్నాడు. ఆ పై ‘ఇహ్సాన్ ‘ అంటే ఏమిటి ఓ ప్రవక్తా? అని ప్రశ్నించాడు. నువ్వు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అలా చేయలేక పోతే అల్లాహ్ యే నిన్ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అని తెలిపారు దానికి అతను ‘ప్రళయం గురించి బోధించండి’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త ‘ఎవరినైతే ఇది అడుగుతున్నావో అతనికి ప్రశ్నిస్తున్న వాడి కంటే ఈ విషయం లో ఎక్కువ జ్ఞానం లేదు‘ అన్నారు. దానికి అతను అయితే ప్రళయ సూచనలు నాకు చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘ఒకటి ‘బానిసరాలు తన యజమానిని జన్మనిస్తుంది, రెండవ సూచన ‘నువ్వు చూస్తావు దుస్తులు లేని, కాళ్ళకు చెప్పులు లేని నగ్నులను, దరిద్రులు పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తారు. పిదప ఆ వ్యక్తి వెళ్లి పోయాడు, చాలా సేపు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు ప్రవక్త ‘ ఓ ఉమర్ ! నీకు ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా? అని అడిగారు. దానికి నేను ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసును‘ అన్నాను. అపుడు ఆయన ‘నిశ్చయంగా అతను జీబ్రయీల్ అలైహిస్సలామ్ మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చారు' అని తెలియజేశారు. ముస్లిం హదీసు గ్రంధము
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలు (మూల నియమాలు) ఐదు అని గుర్తుంచుకోండి; అవి:
షహాదతు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ - (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం).
వ ఇఖాము స్సలాహ్ - సలాహ్ (నమాజు) ను స్థాపించడం.
వ ఈతాఇ జ్'జకాహ్ - జకాతు (విధిదానం) చెల్లించడం
వ సౌము రమజాన్ - రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం
వ హజ్జ బైతుల్లాహిల్ హరామ్ - హజ్ యాత్ర చేయడం
2 - అర్కానుల్ ఈమాన్ (విశ్వాస మూల నియమాలు) లను గుర్తుంచుకోండి. అవి ఆరు:
అల్లాహ్ పై విశ్వాసం
దైవదూతలపై విశ్వాసం
దైవగ్రంధాలపై విశ్వాసం
దైవప్రవక్తలపై విశ్వాసం
ప్రళయదినముపై విశ్వాసం
ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం.
3 - రుకునుల్ ఇహ్'సాన్ (ఇహ్'సాన్ మూలనియమం). ఇహ్'సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించ లేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడని భావిస్తూ ఆయనను ఆరాధించడం.
4 - ప్రళయదినం సంభవించే సమయం , మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాని గురించి తెలియదు.
నాలుగవ హదీసు: