జవాబు: సురతు ఖురైష్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటుపడ్డారు. (అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు. 2 కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి! 3 వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. 4 [సూరతు ఖురైష్ : 1-4వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (లి ఈలాఫి ఖురైష్) 1 : ఇది మక్కా ప్రజలకు సుపరిచితమైన శీతాకాలం మరియు వేసవికాలం వ్యాపార ప్రయాణాలను సూచిస్తుంది.
2 - (ఈలాఫిహిమ్ రిహ్'లత ష్షితాయి వస్"సైఫ్) 2 : శీతాకాలపు ప్రయాణంలో యెమన్ మరియు వేసవి ప్రయాణంలో వారు మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న సిరియా వంటి ప్రదేశాలకు (వ్యాపారబృందాలతో) సురక్షితంగా వెళ్ళేవారు.
3 - (ఫల్ యఅబుదూ రబ్బ హాదల్ బైత్) 3 : కావున వారు ఈ పరిశుద్ధ గృహము యొక్క ఒక్కడే ప్రభువైన అల్లాహ్ ను ఆరాధించాలి. ఎవరైతే వారి కొరకు ఈ ప్రయాణమును శులభతరం చేశారో. మరియు ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు.
4 - (అల్లజీ అత్'అమహుమ్ మిన్ జూఇవ్ వ ఆమనహుమ్ మిన్ ఖౌఫ్) 4 : అరబ్బులు అల్-హరామ్ (పవిత్ర ప్రాంగణాన్ని) మరియు దాని ప్రజలను గౌరవించేలా చేయడం ద్వారా ఈ వ్యాపార ప్రయాణాల ఏర్పాటు ఆకలిదప్పులకు గురికాకుండా మక్కా ప్రజలకు సమృద్ధిగా సంపదను అందించింది మరియు భయం నుండి వారిని రక్షించింది.