జవాబు: సూరతుల్ అస్ర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
కాలం సాక్షిగా (1) నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! (2) కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! (3) [1] [సూరతుల్ అస్ర్ : 1-3 వ ఆయతులు)
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (వల్ అస్ర్) 1 : సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కాలంపై ప్రమాణం చేస్తున్నాడు.
2 (ఇన్నల్ ఇన్'సాన లఫీ ఖుస్ర్) - 2 : మానవాళి అంతా పూర్తిగా నష్టాల్లో ఉన్నది.
3 - (ఇల్లల్లజీన ఆమనూ, వ అమిలుస్సాలిహాతి వతవాసౌ బిల్ హఖ్ఖి వతవాసౌ బిస్సబ్ర్) 3 : విశ్వసించి, సత్కార్యాలను ఆచరిస్తూ, అదే సమయంలో సత్యం వైపు పిలుస్తూ, సహనంతో ఉండే వారు మాత్రమే ఆ నష్టం నుండి బయటపడతారు.