జవాబు: సూరతుల్ ఆదియాత్ పఠనం మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానము):
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
- వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా 1 తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి; 2 తెల్లవారుజామున దాడిచేసే వాటి; 3 (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;4 (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.5 నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.6 మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.7 మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.8 ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;9 మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;10 నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని! 11 [సూరతుల్ ఆదియాత్ : 1-11 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - : వల్'ఆదియాతి జబ్'హా 1 (అల్లాహ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్దము వినబడుతుంది.)
2 - : ఫల్ మూరియాతి ఖద్'హా 2 (నేలపై రాళ్లను బలంగా తాకినప్పుడు తమ గిట్టలతో అగ్ని మెరుపులను మెరిపించే గుర్రాలపై కూడా ప్రమాణం చేస్తున్నాడు.)
3 - : ఫల్ ముగీరాతి శుబ్'హా 3 (ఉదయాన్నే శత్రువులపై దాడి చేసే గుర్రాలపై ప్రమాణం చేస్తున్నాడు.)
4 - : ఫఅసర్'న బిహీ నఖ్'ఆ 4 (కాబట్టి, అవి తమ పరుగు ద్వారా దుమ్మును లేపుతాయి.)
5 - : ఫ వసత్'న బిహీ జమ్'ఆ 5 (శత్రువుల గుంపు మధ్యలోకి తమ రౌతులతో దూకుతాయి.)
6 - : ఇన్నల్ ఇన్'సాన లిరబ్బిహి లకనూద్ 6 (నిజానికి, మనిషి తన ప్రభువు (ఇతరులకు) ఇవ్వమని తనకు ఆజ్ఞాపించిన మంచితనాన్ని (ఇవ్వకుండా తన వద్దే) ఆపు కుంటున్నాడు.)
7 - : వ ఇన్నహు అలా జాలిక లషహీద్ 7 (మంచితనాన్ని తన వద్దనే ఆపి వేసిన దానికి స్వయంగా అతనే సాక్షి మరియు అది స్పష్టంగా ఉన్నందున అతను దానిని తిరస్కరించలేడు.)
8 - : వ ఇన్నహు లి హుబ్బిల్ ఖైరి లషదీద్ 8 (సంపదపై అతనికి ఉన్న విపరీతమైన ప్రేమ కారణంగా, అతను అత్యాశతో దానిని ఆపివేస్తాడు.)
9 - : అఫలా యఅ'లము ఇజా బుఅ'సిర మా ఫిల్'ఖుబూర్ 9 ( ఏమీ, ఇహలోకముతో ఈ మోసపోయే మానవునికి అల్లాహ్ సమాధులలో ఉన్న మృతులను లెక్క తీసుకోవటానికి మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపి నేల నుండి వెలికి తీసినప్పుడు తాను ఊహిస్తున్న విషయం కాదని తెలియదా ?!)
10 - : వ హుస్సిల మా ఫిస్సుదూర్ 10 (ఉద్దేశాలు, విశ్వాసాలు మరియు ఇతరుల హృదయాలలో దాగి ఉన్నవన్నీ చూపబడతాయి మరియు వెలుగులోకి వస్తాయి.)
11 - ఇన్న రబ్బహుమ్ బిహిమ్ యౌమఇజిన్ ల ఖబీర్ (నిశ్చయంగా వారి ప్రభువు వారి గురించి ఆ దినమున బాగా తెలిసి ఉంటాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయన వద్ద గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి దాని ప్రకారం ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.11:)