2:సూరతుల్ జల్'జలహ్ పఠించు మరియు దాని వ్యాఖ్యానం వివరించు?

జవాబు: సూరతుల్ జల్'జలహ్ మరియు దాని వ్యాఖ్యానము

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు, 1 మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు, 2 మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు, 3 ఆ రోజు అది తనలోని సమాచారాన్నంతా బహిరంగ పరిచినప్పుడు, 4 ఎందుకంటే, నిశ్చయంగా నీ ప్రభువు దానిని ఆదేశించి ఉన్నాడు. 5 ఆ రోజు తమ తమ కర్మలు చూపించబడటానికి ప్రజలను వేర్వేరు గుంపులలో తీసుకు వెళ్ళడం జరుగుతుంది. 6 మరియు అలాగే, ప్రతి ఒక్కడూ తాను రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 7 మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 8 [సూరతుల్ జల్'జలహ్: 1-8వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - ఇజా జుల్'జిలతిల్ అర్దు జిల్'జాలహా: (భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు!)

2 - వ అఖ్రజతిల్ అర్'జు అస్'ఖాలహా: (మరియు భూమి తన లోపల ఉన్న చనిపోయిన వారి అవశేషాలను మరియు ఇతర వస్తువులను బయటకు తీసుకు వచ్చినప్పుడు!)

3 - వ ఖాలల్ ఇన్'సాను మా లహా: (మరియు మనిషి గందరగోళంగా ఇలా అంటాడు: "ఎందుకు భూమి అలా కదులుతోంది మరియు కంపిస్తుంది?!")

4 - యౌమఇజిన్ తుహద్దిసు అఖ్'బారహా: (ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది.)

5 - బి అన్న రబ్బక ఔహా లహా: (ఎందుకంటే అల్లాహ్ దానిని అలా చేయమని ఆదేశించాడు.)

6 - యౌమఇజియ్ యశ్'దురున్నాసు అష్'తాతల్'లియురౌ అ'మాలహుమ్: (ఆ మహత్తర దినాన, భూమి కంపించినప్పుడు, లెక్కల కోసం ప్రజలు గుంపులుగా వస్తారు మరియు వారికి వారి ప్రాపంచిక పనులు చూపబడతాయి.)

7 - ఫమైయ్యామల్ మిస్ ఖాల జర్రతిన్ ఖైరైయ్యరహ్: (ఎవరైతే రవ్వంత మేలు చేసినా అది అతని ముందుకు తీసుకు రాబడుతుంది.

8 - వమైయ్యామల్ మిస్ ఖాల జర్రతిన్ షర్రైయ్యరహ్: (ఎవరైతే రవ్వంత కీడు చేసినా అది అతని ముందుకు తీసుకు రాబడుతుంది.)