జవాబు: సూరతున్నాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1) మానవుల చక్రవర్తి. (2) మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)! 3 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; 4 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!5 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!6 [సూరతున్నాస్: 1-6వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (ఖుల్ అవూదు బిరబ్బిన్నాస్) 1 : ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించు: నేను మానవాళి ప్రభువు వద్ద రక్షణ మరియు ఆశ్రయం పొందుతున్నాను.
2 - (మలికిన్నాస్) 2 : ప్రజల చక్రవర్తి. ఆయన తాను తలచుకున్న వాటితో వారిలో కార్య నిర్వహణ చేస్తాడు. ఆయన తప్ప వారికి ఏ చక్రవర్తి లేడు.
3 - (ఇలాహిన్నాస్) 3 : వారి నిజమైన ఆరాధ్యుడు, మరియు వారి ఆరాధనల కొరకు ఆయనను మించిన వేరే ఆరాధ్యుడు మరొకడు లేడు.
4 - (మిన్'షర్రిల్ వస్'వాసిల్ ఖన్నాస్) 4 : ప్రజల వద్ద గుసగుసలాడే షైతానుల యొక్క చెడు నుండి.
5 - (అల్లజీ యువస్'విసు ఫీ సుదూరిన్నాస్) 5 : ఎవరైతే మానవాళి హృదయాలలో గుసగుసలాడుతూ ఉంటారో.
6 - (మినల్ జిన్నతి వన్నాస్) 6 : అలా గుసగుసలాడేది జిన్ నుండి కావచ్చు లేదా మానవజాతి నుండి కావచ్చు అని దీని అర్థం.