16:సూరతుల్ ఫలఖ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ ఫలఖ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3 మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4 : అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 : [సూరతుల్ ఫలఖ్ : 1-5వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఖుల్ అవూదు బిరబ్బిల్ ఫలఖ్) 1 : ఓ ప్రవక్తా! ప్రకటించు: నేను ఉదయం యొక్క యజమానిని ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాను.

2 - (మిన్'షర్రిల్ మా ఖలఖ్) 2 : హానికరమైన జీవుల చెడు నుండి

3 - (వ మిన్'షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్) 3 : మరియు విషజంతువులు మరియు దొంగలు వంటి రాత్రిపూట కనిపించని చెడుల నుండి నేను అల్లాహ్ను శరణు కోరుతున్నాను.

4 - (వ మిన్'షర్రిన్ నఫ్ఫా సాతి ఫిల్ ఉఖద్) 4 : మరియు ముడుల మీద ఊదుతున్న మాంత్రికుల చెడు నుండి నేను అల్లాహ్ వద్ద శరణు కోరుతున్నాను.

5 - (వ మిన్'షర్రి హాసిదిన్ ఇజా హసద్) 5 : మరియు అల్లాహ్ వారికి ప్రసాదించిన దీవెనలను చూసి ఓర్పుకోలేక, ప్రజలను ద్వేషించే మరియు అసూయపడే వ్యక్తి యొక్క చెడు నుండి. ఆ ప్రజలు ఇకపై అలాంటి ఆశీర్వాదాలను పొందకూడదని మరియు వారికి హాని కలిగించాలని ఆ దుష్టులు కోరుకుంటారు.