జవాబు: సూరతుల్ ఇఖ్లాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
{ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2) {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.} 3 {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} [సూరతుల్ ఇఖ్లాస్: 1-4వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (ఖుల్ హువల్లాహు అహద్) 1 : (ఓ ప్రవక్తా! ప్రకటించు): ఆయనే అల్లాహ్, ఏకైకుడు; ఆయన తప్ప ఆరాధనలకు అర్హుడైన ఆరాధ్యుడు లేడు.
2 - (అల్లాహుస్ సమద్) 2 : సృష్టి యొక్క అన్ని అవసరాలు ఆయన మాత్రమే తీర్చగలడు.
3 - (లమ్ యలిద్ వలమ్ యూలద్) 3 : ఆయన ఎవరినీ కనలేదు మరియు ఆయనను ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు.
4 - (వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్) 4 : సృష్టిలో ఏదీ ఆయనలా లేదు.