14: సూరతుల్ మసద్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ మసద్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక! 1 అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు! 2 అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! 3 మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 4 ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది. 5 [సూరతుల్ మసద్ : 1-5వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్బ్) 1 : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను దుర్భాషలాడడం వల్ల ప్రవక్త యొక్క పినతండ్రి అబూ లహబ్ ఇబ్నే అబ్దుల్ ముత్తలిబ్ అతని పనులు నశించినట్లే, అతని చేతులు నశించును.

2 - (మా అగ్'నా అన్'హు మాలహు వమా కసబ్) 2 : అతని సంపద మరియు సంతానం అతనికి ఏమైనా ఉపయోగపడ్డాయా? వారు అతనిని హింస నుండి రక్షించలేరు లేదా అతనిని కరుణింపబడేలా చేయలేరు.

3 - (సయస్'లా నారన్ జాత లహబ్) 3 : తీర్పుదినాన, అతను నరకాగ్నిలోకి ప్రవేశించబడతాడు, అక్కడ అతను దాని వేడిని అనుభవిస్తాడు.

4 - (వమ్'రఅతుహు హమ్మాలతల్ హతబ్) 4 : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దారిలో ముళ్ళు విసిరి గాయపరిచే అతని భార్య ఉమ్మే జమీల్ కూడా నరకాగ్నిలో చేర్చబడుతుంది.

5 - (ఫీ జీదిహా హబ్'లుమ్ మిమ్ మసద్) 5 : ఆమె మెడకు బిగుతైన తాడు బిగించబడి, నరకాగ్నిలోకి విసిరి వేయబడుతుంది.