జవాబు: సూరతున్నసర్ మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)! 1 మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 2 అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 3 [సూరతున్నసర్: 1-3వ ఆయతులు ]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్'హ్) 1: ఓ ప్రవక్తా! అల్లాహ్ మీ ధర్మానికి విజయాన్ని మరియు బలాన్ని ప్రసాదించినప్పుడు మరియు మక్కాను జయించినప్పుడు.
2 - (వరఐతన్నాస యద్'ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్'వాజా) 2: ప్రజలు తండోప తండాలుగా ఇస్లాం స్వీకరించడాన్ని నీవు చూస్తావు.
3 - (ఫసబ్బిహ్ బిహమ్'ది రబ్బిక వస్'తగ్'ఫిర్హు ఇన్నహు కాన తవ్వాబా) 3 : కాబట్టి మీరు అది మీరు ఏ కార్యంతో పంపించబడ్డారో దాని ముగింపు దగ్గర పడినది అనటానికి సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్తుతులతో ఆయన పరిశుద్ధతను కొనియాడండి. సహాయం, విజయాల యొక్క అనుగ్రహాలకు బదులుగా ఆయనకు కృతజ్ఞత చూపుతూ, ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తాపమును బాగా స్వీకరిస్తాడు మరియు వారిని మన్నిస్తాడు.