జవాబు: సూరతుల్ కాఫిరూన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!1 మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;2 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.3 మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.4 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.5 మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"6 [సూరతుల్ కాఫిరూన్ : 1-6వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) 1 : (ఓ ప్రవక్తా! వారితో ఇలా అను) - : అవిశ్వాసులారా!
2 - (లా అఆబుదు మా తఅబుదూన్) 2 : మీరు ఆరాధించే విగ్రహాలను నేను ఆరాధించను.
3 - (వలా అన్'తుమ్ ఆబిదూన మా అఆబుద్) 3 : అలాగే, నేను ఆరాధించే ఆయనను అంటే అల్లాహ్ ను మీరు ఆరాధించరు.
4 - (వలా అన ఆబిదుమ్ మా ఆబద్'తుమ్) 4 : మరియు మీరు ఆరాధించే విగ్రహాలను నేను ఎన్నటికీ ఆరాధించను.
5 - (వలా అన్'తుమ్ ఆబిదూన మా అఆబుద్) 5 : అలాగే నేను ఆరాధించే ఆయనను అంటే అల్లాహ్ ను మీరు ఎప్పుడూ ఆరాధించరు.
6 - (లకుమ్ దీనుకుమ్ వలియదీన్) 6 : మీరు కనిపెట్టిన మతం మీ కొరకే మరియు అల్లాహ్ నాకు వెల్లడించిన నా ధర్మం నా కొరకు ఉండనే ఉంది.