11: సూరతుల్ కౌసర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

జవాబు: సూరతుల్ కౌసర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము. 1 {కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!}[2] నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు. 3 [సూరతుల్ కౌసర్ : 1-3వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఇన్నా అ'ఆతైనాకల్ కౌసర్) 1: (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు అందులో నుంచే.

2 - (ఫసల్లి లిరబ్బిక వన్'హర్) 2: కావున మీరు ఈ అనుగ్రహముపై అల్లాహ్ కు కృతజ్ఞతను తెలుపుకోండి ఆయన ఒక్కడి కొరకు మీరు నమాజును పాటించి మరియు జుబాహ్ చేసి. ముష్రికులు తమ విగ్రహాల సామిప్యము పొందటం కొరకు ఏదైతే జుబాహ్ చేసేవారో దానికి వ్యతిరేకంగా.

3 - (ఇన్న షానిఅక హువల్ అబ్'తర్) 3 : నిశ్చయంగా మిమ్మల్ని ద్వేషించేవాడు ప్రతీ మేలు నుండి తెగిపోతాడు, నామరూపాలు లేకుండా మరపింప చేయబడతాడు, ఒకవేళ అతడి ప్రస్తావన జరిగినా చెడ్డగా ప్రస్తావించ బడతాడు.