జవాబు: సూరతుల్ మాఊన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? 1 అతడే అనాధులను కసరి కొట్టేవాడు; 2 మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. 3 అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4) ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5) ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)! (6) మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో (7) [సూరతుల్ మాఊన్ : 1-7వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (అరఐతల్లజీ యుకజ్జిబు బిద్దీన్) 1 : తీర్పుదినాన ప్రతిఫలాన్ని నిరాకరించే వ్యక్తి ఎవరో తెలుసా?
2 - (ఫజాలికల్లజీ యదువ్వుల్ యతీమ్) 2 : అతడు అనాధను నిర్దయగా తిప్పికొట్టేవాడు.
3 - (వలా యహుజ్జు అలా తఆమిల్ మిస్'కీన్) 3 : అతడు పేదలకు ఆహారం పెట్టమని స్వయంగా ముందుకు అడుగు వేయడు లేదా ఇతరులను ప్రేరేపించడు.
4 - (ఫవైలుల్ లిల్ ముసల్లీన్) 4 : అలాంటి నమాజీలు నాశనమవు గాక.
5 - (అల్లజీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్) 5 : ఎవరైతే సలాహ్ పట్ల నిర్లక్ష్యం వహిస్తారో.
6 - (అల్లజీన హుమ్ యురావూన్) 6 : ఎవరైతే ఇతరులకు చూపడానికే నమాజులు మరియు మంచిపనులు చేస్తారో మరియు వాటిని అల్లాహ్ కు చిత్తశుద్ధితో అంకితం చేయరో.
7 - (వ యమ్'నఊనల్ మావూన్) 7 : మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు.