5: వుజులో తప్పనిసరి ఆచరణలు ఏమిటి?

జవాబు: వుజులో విధిగా చేయవలసిన ఆచరణలు ఇక్కడ పేర్కొనబడినాయి. వాటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టినా, ఒకరి వుజు చెల్లుబాటు కాదు. అవి:

1 - ముఖం కడుక్కోవడం, నోట్లో మరియు ముక్కులో నీరు ఎక్కించి శుభ్రం చేసుకోవడం.

2 - రెండు చేతులూ మోచేతుల వరకు కడుక్కోవడం.

3 - తడి అరచేతులతో తలపై తడపడం మరియు రెండు చెవులను శుభ్రం చేసుకోవడం.

4 - రెండు పాదాలు చీలమండలాల వరకు శుభ్రంగా కడుక్కోవడం.

5 - ముందుగా ముఖాన్ని కడుక్కోవడం, తర్వాత చేతులు కడుక్కోవడం, తర్వాత తలపై తుడవడం, చివరగా పాదాలు కడుక్కోవడం వరుస క్రమంలో పాటిస్తూ, నిర్దేశించిన క్రమాన్ని అనుసరించడం.

6 - వరుస క్రమంలో అంటే అవయవాలు పొడిగా మారడానికి అనుమతించే సమయ వ్యవధి అధిగమించకుండా వుజు అవయవాలను వరుసగా ఒకదాని తరువాత ఒకటి కడగడం.

వుజు మొత్తం ఒకేసారి పూర్తి చేయకుండా, ఒకసారి సగం మాత్రం చేసి, కొంతసేపటి తరువాత మిగతా సగం చేస్తే ఆ వుజు చెల్లదు.