4: వుజు ఎలా చేయాలి?

జవాబు: ముందుగా అరచేతులు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.

తత'మజ్ మజ, తస్'తంషఖ్ మరియు తస్'తంసిర్ మూడు సార్లు చేయాలి.

అల్ మజ్'మజహ్: అంటే నోటిలో నీరు పట్టి, బాగా పుక్కిలించి, బయటకు ఉమ్మేయాలి.

అల్ ఇస్తింషాఖ్: అంటే ముక్కులో నీరు ఎక్కించి, ఎడమచేతి వేళ్ళతో ముక్కు లోపల శుభ్రం చేసుకోవటం.

తస్'తంసిర్: ముక్కు లోపల ఎడమచేతి వ్రేళ్ళతో శుభ్రపరుచుకున్న తరువాత ముక్కును పట్టుకుని, ఆ నీటిని బయటికి చీదడం.

ఆ తరువాత, ముఖాన్ని మూడు సార్లు కడగాలి

ఆ తరువాత, మోచేతుల వరకు రెండు చేతులూ మూడు సార్లు చేతులు కడగాలి (ముందుగా కుడిచేయి కడగాలి, తరువాత ఎడమచేయి).

ఆ తరువాత, రెండు తడి అరచేతులను దగ్గరగా చేర్చి, తలపై తుడవాలి (నుదురు పైభాగం నుండి ప్రారంభించి, వెనక్కు), రెండు చెవుల లోపలి భాగాన్ని చూపుడు వ్రేలితో, మరియు చెవి వెనుక భాగాన్ని బొటన వ్రేలితో శుభ్రపరచుకోవాలి.

ఆ తరువాత, రెండు పాదాలను చీలమండలాల వరకు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. (ముందుగా కుడిపాదం కడగాలి, తరువాత ఎడమపాదం).

దీనితో మీ వుజు పూర్తి అవుతుంది. ఉస్మాన్, అబ్దుల్లాహ్ బిన్ జైద్ మొదలైన వారి (రదియల్లాహు అన్హుమ్) ఉల్లేఖనల ఆధారంగా సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీసు గ్రంధాలలో ప్రామాణికంగా నమోదు చేయబడిన అత్యంత పరిపూర్ణమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ పద్ధతి. వుజులో శుభ్రపరచుకోవలసిన శరీర అవయవాలు ఒక్కోసారి లేదా రెండు రెండు సార్లు కడగ వలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రామాణికంగా సహీహ్ అల్ బుఖారీ మరియు ఇతర హదీసు గ్రంధాలలో నమోదు చేయబడింది.