36:? సదఖతుల్ ముస్తహబ్ అంటే సిఫారసు చేయబడిన దానధర్మం అంటే ఏమిటి?

జవాబు: సదఖతుల్ ముస్తహబ్ అంటే సిఫారసు చేయబడిన దానధర్మాలలో జకాతు కాకుండా ఇతర అన్ని రకాల దానధర్మాలు వస్తాయి. ఉదాహరణకు ఏ సమయంలోనైనా ఏ మంచి పనికైనా ఉపయోగపడేలా ఏదైనా దానం చేయడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : అల్లాహ్ మార్గంలో ఖర్చు (దానధర్మాలు) చేయండి. [సూరతుల్ బఖరహ్: 195 ఆయతు]