జవాబు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఒక ముస్లిం దాసుడు లేదా ఒక మోమిన్ దాసుడు (ముస్లిం లేదా మోమిన్ పదాలలో ఏది అన్నారనే దానిపై ఉల్లేఖకునికి సంశయం ఉంది ) వుజు ఆచరిస్తున్నపుడు తన ముఖాన్ని నీటితో శుభ్రపరుస్తాడు ఆ క్రమం లో అతని ముఖం నుండి కళ్ల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేదా ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. చేతులు శుభ్రపరిచినపుడు ఆ చేతుల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేక ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. కాళ్ళు శుభ్రపరిచినప్పుడు వాటి ద్వారా జరిగిన పాపాలన్నీ తుడిచి వేయబడతాయి. చివరికి అతను తన పాపాలన్నింటి నుండి పరిశుద్దుడవుతాడు. ముస్లిం హదీసు గ్రంధము