25: ఒక ముస్లిం సలాహ్ (నమాజు) ఎలా చేయ వలెను?

జవాబు: సలాహ్ (నమాజు) చేసే పద్ధతి

1 - ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.

2 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ సలాహ్ (నమాజు) చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.

3 - భుజాల ఎత్తులో ఖిబ్లాకు అభిముఖంగా అరచేతులు ఉండేలా రెండు చేతులు పైకి ఎత్తి, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ తక్బీర్ అల్ ఇహ్రామ్ పూర్తి చేయాలి.

4 - ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.

5 - ఈ దుఆ చేస్తూ సలాహ్ ప్రారంభించండి: అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖ స్సౌబల్ అబ్యజి మినద్'దనసి, అల్లాహుమ్మగ్'సిల్నీ మిన్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జీ వల్ బర్'దీ (ఓ అల్లాహ్! మీరు తూర్పును పశ్చిమం నుండి వేరు చేసినట్లుగా, నా పాపాల నుండి నన్ను వేరు చేయుము. ఓ అల్లాహ్! తెల్లని వస్త్రం నుండి మరకలను తొలగించినట్లు నా పాపాల నుండి నన్ను శుభ్రపరచు. ఓ అల్లాహ్! మంచు, నీరు మరియు వడగళ్ళతో నా పాపాలను కడిగివేయి).

లేదా ఈ దుఆ చేయండి: "సుబహానకల్లాహుమ్మ వబిహమ్'దిక వతబారకస్ముక వతఆలా జద్'దుక వలా ఇలాహ గైరుక". (ఓ అల్లాహ్! నీ ప్రశంసతో నీకు మహిమ కలుగునుగాక! నీ నామము శుభమైనది మరియు నీ మహిమ శ్రేష్ఠమైనది. మరియు నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు)

6 - అల్లాహ్ వద్ద ఈ పదాలు పలుకుతూ శరణు వేడుకోండి. అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను) 7 - ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించ వలెను. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1) అల్హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ (స్తుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి).(2) అర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడు) (3) మాలికి యౌమిద్దీన్ (తీర్పుదినానికి యజమాని). (4) ఇయ్యాక నఆబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము).(5) ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్ (మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి).(6) శిరాతల్లదీన్ అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ (నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు).(7) [సూరతుల్ ఫాతిహ : 1-7]

ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను. :

8 - తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఉదయపు ఫజ్ర్ సలాహ్ లో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయ వలెను.

9 - ఆ తరువాత (అల్లాహు అక్బర్) తక్బీర్ పలుకుతూ, రెండు చేతులూ భుజాల వరకు ఖిబ్లా దిశలో పైకెత్తి, దించుతూ రుకూలోకి వెళ్ళవలెను. రుకూలో చేతి వ్రేళ్ళను వ్యాపింపజేసి, రెండు అరచేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకుని, వీపును తిన్నగా అంటే నేలకు సమాంతరంగా ఉంచి, తల మరియు నడుము ఒకే ఎత్తులో ఉండేటట్లు చూడటం సున్నతు.

10 - రుకూలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ (లోపాలూ, కొరతలకు అతీతుడైన నా ప్రభువుకే సకల కీర్తనలు), ఇంకా ఇలా కూడా పలికితే మంచిది: సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్లీ ((ఓ అల్లాహ్! నీవు ఎలాంటి లోపాలకూ, కొరతలకూ అతీతుడవు. ఓ అల్లాహ్, నన్ను క్షమించు)

11 - ఆ తరువాత రుకూ నుండి తన తల పైకెత్తుతూ, మరలా రెండు చేతులు భుజాల వరకు పైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదహ్ (అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటాడు) అని పలక వలెను. ఇమాంను అనుసరిస్తూ, ఆయన వెనుక సలాహ్ చేస్తున్నవారు, బదులుగా ఇలా పలక వలెను రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ మా ప్రభూ! సకల స్తోత్రములు నీకే శోభిస్తాయి).

12 - అలా పైకి లేచి, నిటారుగా నిలబడిన తరువాత రబ్బనా వలకల్ హమ్'ద్ మిల్అ స్సమావాతి వ మిల్ అల్ అర్'ది, వ మా బైనహుమా వ మిల్అ మా షిఅత మిన్ షైయిన్ బఆదు. అహ్లలథ్థనాయి వల్ మజ్ది అహఖ్'ఖు మా ఖాలల్ అబ్'దు వ కుల్లునా లక అబ్దున్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత వలా మూతియ లిమా మనఆత వలా యన్'ఫవు దల్ జద్ది మిన్కల్ జద్దు (ఆకాశాల నిండుగా, భూమి నిండుగా మరియు వాటి మధ్య నున్న వాటి నిండుగా, ఆ తరువాత నీవు తలచిన వాటన్నింటి నిండుగా (ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి). సమస్త ప్రశంసలు మరియు ఘనతలు గలవాడవు. దాసుడు సెలవిచ్చిన మాట అత్యంత సత్యమైనది. మేమంతా నీకు దాస్యం చేయువారము. ఓ అల్లాహ్! నీవు ఇవ్వదలిస్తే అడ్డగించే వాడెవ్వడూ లేడు. మరియు నీవు ఇవ్వదలచక పోతే దాన్ని ప్రసాదించే వాడెవ్వడూ లేడు. ఏ గొప్పవాని గొప్పతనమూ నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్నీ చేకూర్చదు) అని పలుక వలెను.

13 - "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ, మొదటి సజ్దాలోకి వెళ్ళ వలెను. శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయవలెను: నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచ వలెను.

14 - సజ్దాలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ ఆలా (సర్వోన్నతుడైన నా ప్రభువు అపర పరిశుద్ధుడు) పలక వలెను. ఇంకా ఇలా పలికితే మంచిది - సుబహానక అల్లాహుమ్మ, రబ్బనా వ బిహమ్'దిక అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభూ! నేను నిన్నుస్తుతిస్తున్నాను. (కనుక) ఓ అల్లాహ్ నన్ను క్షమించు)

15 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి తల పైకెత్త వలెను.

16 - ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశాంతంగా కూర్చోవలెను.

17 - రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయవలెను. రబ్బిగ్'ఫిర్లీ వర్'హమ్'నీ, వహ్'దినీ, వరజుఖ్'నీ, వజ్'బుర్'నీ, వఆఫినీ (ఓ నా ప్రభూ నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు సన్మార్గం వైపు మార్గదర్శకం చేయి, నాకు ఉపాధి ప్రసాదించు, నా నష్టాన్ని పూడ్చు, నాకు ఉన్నత స్థానాన్ని ప్రసాదంచు.)

18 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ మొదటిసారి చేసినట్లుగానే చేస్తూ, మొదటి సజ్దాలో ప్రార్థించినట్లుగానే ప్రార్థిస్తూ, రెండవ సారి సజ్దా చేయ వలెను.

19 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండవ సజ్దా నుండి లేచి నిలబడ వలెను (ఇక్కడితో మొదటి రకాతు పూర్తయింది), మొదటి రకాతులో పలికినట్లుగా, ఆచరించినట్లుగానే చేస్తూ రెండవ రకాతు పూర్తి చేయ వలెను.

20 - రెండవ రకాతులోని రెండవ సజ్దా చేసిన తరువాత రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లుగానే లేచి కూర్చో వలెను.

21 - అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను. అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను,

22 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.

23 - ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల సలాహ్ (నమాజు) చేస్తున్నట్లయితే, మొదటి తషహ్హుద్ లో అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వద్ద ఆపి వేయవలెను.

24 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు చేతులు మరలా ఖిబ్లా వైపు భుజాల వరకు ఎత్తి, మూడవ రకాతు కొరకు లేచి నిలబడ వలెను.

25 - ఆ తరువాత రెండవ రకాతు చేసినట్లుగానే మూడవ రకాతులో చేయవలెను. అయితే, సూరతుల్ ఫాతిహా పఠనం తరువాత ఖుర్ఆన్ లోని మరోభాగం పఠించనవసరం లేదు.

26 - మొదటి తషహ్హుద్ లో కూర్చున్నట్లుగానే ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి లేదా కుడికాలి క్రింద ఎడమ కాలు క్రాస్ గా తీసుకు వచ్చి, ఎడమ పిరుదుపై కూర్చుని; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశంతంగా కూర్చోవలెను. (గమనిక: ఒకవేళ నాలుగు రకాతుల సలాహ్ చేస్తున్నట్లయితే, మూడవ రకాతులో కూర్చోకుండా, లేచి నిలబడి రెండవ రకాతు పూర్తి చేసినట్లుగానే నాలగవ రకాతు పూర్తి చేసి, రెండవ సజ్దా తరువాత కూర్చుని తషహ్హుద్ లోని రెండవ భాగాన్ని పఠించి, సలాము పలుకుతూ సలాహ్ ను పూర్తి చేయవలెను.)

27 - అలా ప్రశాంతంగా కూర్చుని, తషహ్హుద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయవలెను.

28 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.