23: సునన్ సలాహ్ అంటే ఏవి?

జవాబు: మొత్తం 11 సునన్ అస్సలాహ్ ఉన్నాయి.

1 - దుఆ అల్ ఇస్తఫ్తాహ్ అంటే తక్బీర్ అల్ ఇహ్రామ్ తరువాత "సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, వ తబారకస్ముక, వ తఅఆలా జద్దుక, వలా ఇలాహ గైరుక" అని పలకడం.

2 - తఅ'వ్వుజ్ అంటే అఊజు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ అని పలకడం.

3 - బస్మలహ్ అంటే బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అని పలకడం.

4 - ఆమీన్ అని పలకడం

5 - సూరతుల్ ఫాతిహా తరువాత వేరే ఏదైనా సూరహ్ గానీ, ఏదైనా సూరహ్ లోని కొన్ని ఆయతులు గానీ పఠించడం.

6 - బిగ్గరగా ఖుర్ఆన్ పారాయణం చేసే సలాహ్ లలో వెనుక ఉన్న వారికి చక్కగా వినిపించేలా ఇమామ్ తన కంఠస్వరాన్ని పెంచి, ఖుర్ఆన్ వచనాలు పఠించడం.

7 - తహ్మీద్ పలకడం (అల్లాహ్ ను స్తుతించడం) - "మిలస్సమావాతి వ మినల్ అర్ద్, వ మినల్ మా షి'త మిన్ షైఇన్ బఆద్" అనే పలుకులు ఇమాం నుండి విన్న తరువాత అల్హందులిల్లాహ్ అంటూ అల్లాహ్ ను స్తుతించడం.

8 - తస్బీహ్ - రుకూలో ఎక్కువసార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ అనే పలుకులను ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.

9 - సజ్దాలో ఒకటి కంటే ఎక్కువ సార్లు తస్బీహ్ చదవటం.

10 - రబ్బిగ్'ఫిర్లీ అనే పదాలను రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.

11 - చివరి తషహ్దుద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం. ఆ తరువాత దుఆలు చేసుకోవడం.

నాలుగవది: సునన్ అల్ అఫ్ఆల్: సలాహ్ లో సిఫారసు చేయబడిన సంజ్ఞలు.

1 - తక్బీర్ అల్ ఇహ్రామ్ పలుకులతో రెండు అరచేతులను ఖిబ్లా దిశలో చెవుల క్రింది భాగం వరకు పైక లేపడం.

2 - రుకూలోకి వెళ్ళే ముందు రఫ్ ఉల్ యదైన్ చేయడం

3 - రుకూ నుండి పైకి లేచిన తరువాత రఫ్ ఉల్ యదైన్ చేయడం.

4 - రఫ్ ఉల్ యదైన్ తరువాత రెండు చేతులను క్రిందికి దించడం.

5 - ఎడమ చేతిపై కుడి చేతిని కట్టడం.

6 - సజ్దా చేసే స్థానంపై మీ కంటిచూపును ఉంచడం.

7 - నిటారుగా నిలబడినప్పుడు రెండు కాళ్ళను సముచితమైన దూరంలో ఉంచడం.

8 - రుకులో రెండు అరచేతులతో మరియు చేతివ్రేళ్ళతో రెండు మోకాళ్లను గట్టిగా పట్టుకోవడం, ఒకరి వీపును నేలకు సమాంతరంగా, తిన్నగా ఉంచుతూ, తల మరియు వీపు సమంగా ఉండేలా ముందుకు వంగడం.

9 - సజ్దా అవయవాలను నేలపై ప్రశాంతంగా ఆన్చడం, అవన్నీ నేలను తాకేలా చూసుకోవడం.

10 - సజ్దాలో రెండు మోజేతులను పక్కల నుండి దూరంగా ఉంచడం, పొత్తికడుపు తొడల నుండి మరియు తొడలను కాళ్ళ నుండి దూరంగా ఉంచడం; మోకాళ్లను వేరుగా ఉంచడం మరియు పాదాల కాలి వేళ్లు వేరు చేయడం మరియు వేళ్ళ మొన భాగాన్ని నేలకు ఆన్చడం; అరచేతులు నేలపై ఆన్చుతూ, వాటి వేళ్ళు కలిపి ఉంచి, మోజేతులను భుజాలకు సమాంతరంగా ఉంచడం.

11 - రెండు సజ్దాల మధ్య మరియు మొదటి తషహ్హుద్ సమయంలో కూర్చున్నప్పుడు ఇఫ్తీరాష్ (ఎడమ పాదాన్ని దాని వైపే ఉంచి, దానిపై కూర్చోవడం; మరియు కుడి పాదాన్ని ఖిబ్లా వైపు కాలి వేళ్ల మొనలు ఉండేలా చేయడం) చేయడం. అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో తవర్రుక్ (ఎడమ వెనుక భాగాన్ని (పిరుదులను) నేలపై పర్చి, దానిపై కూర్చోవడం; కుడి పాదం కాలి వేళ్ల ఖిబ్లా వైపు ఉంచి, పాదాన్ని నిటారుగా ఉండేలా చేయడం; మరియు ఎడమ పాదాన్ని కుడి పాదం కింద ఉండేలా చేయడం) చేయడం.

12 - రెండు సజ్దాల మధ్య మరియు తషహ్హుద్ సమయంలో చేతి వ్రేళ్ళను దగ్గరగా ఉంచి, రెండు అరచేతులను రెండు తొడల మీద పెట్టడం; అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో, తన కుడి చేతి యొక్క చిన్న మరియు ఉంగరపు వేళ్లను (చివరి రెండు వేళ్ళను) బిగించి, బొటనవేలు మరియు మధ్య వేళ్లతో ఉంగరాన్ని తయారు చేయవచ్చు మరియు అల్లాహ్ నామం ప్రస్తావిస్తున్నప్పుడు చూపుడు వేలును పైకి లేపి చూపవలెను.

13 - తస్లీమ్ చేస్తున్నప్పుడు ముందుగా ముఖాన్ని కుడివైపుకు త్రిప్పాలి, ఆ తరువాత ఎడమవైపునకు.