జవాబు: మొత్తం పధ్నాలుగు అర్'కానులు: అవి
వాటిలో మొదటిది: తప్పనిసరి ఫర్ద్ సలాహ్ లో (నమాజులో) నిటారుగా నిలబడటం (ఆరోగ్యంగా ఉంటే).
"అల్లాహు అక్బర్" అనే పదాలతో తక్బీర్ అల్ ఇహ్రామ్ పలకడం.
సూరతుల్ ఫాతిహా పఠించడం
రుకూ చేయడం అంటే తన తల మరియు వీపు ఒకే ఎత్తులో ఉండేటట్లుగా తన వీపును ముందుకు వంచడం.
రుకూ నుండి లేవడం
నిటారుగా నిలబడటం
సుజూద్ (సాష్టాంగం): నుదురు, ముక్కు, రెండు అరచేతులు (చెవులకు దగ్గరలో), రెండు మోకాళ్ళు, రెండు పాదాల బొటన వ్రేళ్ళు నేలపై ఆన్చి, సాష్టాంగం చేయడం.
సజ్దా నుండి పైకి లేవడం
రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం
ఇక్కడ కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, కాలి వేళ్లను ఖిబ్లా దిశలో ఉంచుతూ, ఎడమ పాదం మీద కూర్చోవడం అనేది సున్నతు చర్య.
ప్రశాంతత: సలాహ్ (నమాజు) లోని ప్రతి భంగిమను, చర్యను ప్రశాంతంగా, మనస్సు లగ్నం చేసి మరీ ఆచరించవలెను.
చివరి తషహ్హుద్ పఠించడం.
తషహ్హుద్ పఠించడం కొరకు కూర్చోవడం.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ ముందుగా కుడివైపు తల త్రిప్పాలి, ఆ తరువాత ఎడమ వైపు తల త్రిప్పాలి.
పైన పేర్కొనబడిన చర్యలను ఇదే వరుసక్రమంలో ఆచరించడం. అంటే ఒకవేళ ఎవరైనా కావాలని రుకూ చేయకుండా ముందు సజ్దా చేసి, ఆ తరువాత రుకూ చేసినట్లయితే, అతని సలాహ్ చెల్లదు. ఒకవేళ మతిమరుపు వలన అలా జరిగితే, అతను లేచి నిలుచొని ముందుగా రుకూ చేసి, తరువాత సజ్దా చేయవలెను.