17: సలాహ్ (నమాజు) గురించి ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?
జవాబు: సలాహ్ (నమాజు) ప్రతి ముస్లింపై విధిగావించబడింది అంటే తప్పనిసరి చేయబడింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {నిస్సందేహంగా సలాహ్ (నమాజు) ను నిర్ణీత వేళల్లో పూర్తి చేయటం విశ్వాసులపై విధిగావించబడింది.} [సూరతున్నిసా : 103వ ఆయతు]