18వ ప్రశ్న: బిద్అతు (ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలు, ఆవిష్కరణలు) అంటే ఏమిటి? మనం వాటిని అంగీకరిస్తామా ?

జవాబు: ప్రజలు ధర్మంలో ఆవిష్కరించిన ప్రతి నూతన కల్పితమూ బిద్అత్ గానే పరిగణించబడుతుంది. మరియు దాని ఉనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల కాలంలో కనబడదు.

దానిని మనం అంగీకరించకూడదు, వాస్తవానికి దానిని సూటీగా తిరస్కరించ వలెను.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతి నూతన ధార్మిక కల్పితం, ఆవిష్కరణ మార్గభ్రష్టత్వమే. అబూ దావుద్ హదీసు గ్రంధము.

ఉదాహరణకు: వుజులో (మూడు సార్లు కడగటంతో ఆగకుండా) నాల్గవ సారి కడగటం, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పుట్టినరోజు జరుపుకోవడం వంటి ఆరాధనలో నిర్దేశించబడిన వాటిలో హద్దులు మీరటం. ఇలాంటివి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి గానీ, ఆయన సహాబాల రజియల్లాహు అన్హుమ్ నుండి గానీ నమోదు చేయబడలేదు.