నైతిక విలువల విభాగం.

జవాబు: నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండే విశ్వాసులు, అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు. [అత్తిర్మిజీ మరియు అహ్మద్ హదీసు గ్రంధాలలో ఉల్లేఖించబడింది.]

జవాబు: 1 - మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి అంటే: 1. ఇది అల్లాహ్ ప్రేమకు దారి తీస్తుంది.

2 - ఇది ప్రజల ప్రేమకు దారి తీస్తుంది.

3 - ఇది (తీర్పుదినాన) త్రాసుపై అత్యంత భారీగా తూగుతుంది.

4 - ఇది పుణ్యాలు మరిన్ని రెట్లు గుణించబడటానికి దారి తీస్తుంది.

5 - ఇది పరిపూర్ణ విశ్వాసానికి సంకేతం, చిహ్నం, సూచన.

జవాబు: పవిత్ర ఖుర్ఆన్ నుండి, మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: {నిశ్చయంగా ఈ 'ఖుర్ఆను' పటిష్టమైన సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేస్తుంది}. [సూరతుల్ ఇస్రాఅ: 9వ ఆయతు] మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతుల నుండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: {నిశ్చయంగా నేను సత్ప్రవర్తనలు, ఉత్తమ నైతికతను సంపూర్ణం చేయడానికి పంపించబడ్డాను} అహ్మద్ హదీసు గ్రంధం

జవాబు: ఇహ్సాన్ (పరోపకారం) అంటే నిరంతరం అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించడం మరియు అన్ని జీవుల పట్ల దయతో మరియు కనికరంతో వ్యవహరించడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: నిశ్చయంగా, అల్లాహ్ అన్ని విషయాలపై దయతో వ్యవహరించమని ఆదేశించాడు. ముస్లిం హదీసు గ్రంధం

ఇహ్సాన్ కు (ఉపకారానికి) కొన్ని ఉదాహరణలు:

ఆరాధనలను పూర్తి చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం.

మాటలలో మరియు చేతలలో తల్లిదండ్రుల పట్ల దయ చూపటం.

రక్తసంబంధీకులు మరియు బంధువుల పట్ల దయ చూపటం.

ఇరుగు పొరుగు వారి పట్ల దయ చూపటం.

అనాధల పట్ల మరియు అక్కరగలవారి పట్ల దయ చూపటం.

మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి పట్ల దయ చూపటం.

వాక్కులో దయ చూపటం.

వాదనలలో దయ చూపటం.

పశువుల పట్ల దయ చూపటం.

జవాబు:ఇహ్సాన్ కు విరుద్ధమైనది అల్ ఇసాఅహ్ (నేరం).

* నేరానికి ఉదాహరణలు: . సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆరాధించడంలో చిత్తశుద్ధి లేకుండా ఉండటం.

* తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం.

* రక్తసంబంధాల తెగత్రెంపు చేసుకోవటం.

* ఇరుగు పొరుగు వారి పట్ల ద్వేషం, శత్రుత్వం చూపటం

* చెడు మాటలు మరియు చేతలతో పాటు పేదలు మరియు అక్కరగలవారి పట్ల దయలేనితనం.

జవాబు:

1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క హక్కులను పరిరక్షించడంలో నిజాయితీ, త్రికరణశుద్ధి.

ఉదాహరణలు: నమాజులు, జకాతు, ఉపవాసం, హజ్ మొదలైన ఆరాధనలను నిర్వహించడంలో త్రికరణశుద్ధి.

2 - ఇతరుల హక్కులను పరిరక్షించడంలో త్రికరణశుద్ధి.

ఉదాహరణలు : . ప్రజల గౌరవాన్ని భద్రపరచడం.

వారి సంపదను భద్రపరచడం.

వారి ప్రాణాలను భద్రపరచడం.

వారి రహస్య వ్యవహారాలు మరియు ఒకరిపై నమ్మకంతో అప్పగించబడిన ప్రతిదీ.

సాఫల్యం పొందే వారి లక్షణాల గురించి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో. [సూరతుల్ మోమినూన్: 8వ ఆయతు]

జవాబు: నమ్మకద్రోహం, మోసం, దగా మొదలైనవి అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ప్రజల హక్కులను వృధా చేయడం.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కపటుడి చిహ్నాలు మూడు : "... మరియు అతనికి ఏదైనా అప్పగించినట్లయితే, అతను నమ్మక ద్రోహం చేస్తాడు..." ముత్తఫఖున్ అలైహి

జవాబు: సత్యసంధత అంటే ఏది వాస్తవికతకు అనుగుణంగా ఉంటుందో లేదా ఏది నిజమో అదే చెప్పడం.

దాని ఉదాహరణలు:

ప్రజలతో మాట్లాడడంలో సత్యసంధత.

వాగ్దానం నెరవేర్చడంలో సత్యసంధత.

ప్రతి మాటలో, ప్రతి ఆచరణలో సత్యసంధత.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: సత్యసంధతకు కట్టుబడి ఉండండి, ఎందుకంటే సత్యం ధర్మానికి దారి తీస్తుంది మరియు ధర్మం స్వర్గానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి అత్యంత సత్యవంతుడు అయ్యేంత వరకు సత్యాన్ని మాట్లాడుతూనే ఉంటాడు. ముత్తఫఖున్ అలైహి

జవాబు: అసత్యం పలకడం,అబద్ధాలాడటం. సత్యసంధతకు విరుద్ధం. దీని అర్థం నిజం చెప్పకపోవడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: {మీరు అసత్యానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అసత్యం మనిషిని పాపం వైపుకు తీసుకెళ్తుంది, ఈ పాపం నిశ్చయంగా అతన్ని నరకానికి చేరవేస్తుంది. ఒకవ్యక్తి ఎల్లప్పుడు అబద్దం చెప్తూ ఉంటాడు, అతను ఆ అబద్దాలను విధిగా చేసుకుంటాడు చివరికి అల్లాహ్ వద్ద అతను అసత్యవాది’అని లిఖించబడతాడు.} ముత్తఫఖున్ అలైహి నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కపటుడి చిహ్నాలు మూడు : "... మరియు అతడు మాట్లాడితే అసత్యాలే పలుకుతాడు ..." ముత్తఫఖున్ అలైహి

జవాబు: మొదటిది - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపడంలో సహనం.

రెండవది - పాపాలు మానుకోవడంలో చూపే సహనం.

మూడవది - కఠినమైన దైవాదేశాలను ఆచరణలో పెట్టడంలో చూపే సహనం మరియు అన్ని స్థితులలోనూ అల్లాహ్ నే స్తుతించడంలో చూపే సహనం.

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: మరియు అల్లాహ్ ఓర్పు గల వారిని ప్రేమిస్తాడు. 146 [సూరతు ఆలే ఇమ్రాన్ : 146వ ఆయతు] నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసి పరిస్థితి చాలా ఆశ్చర్యకరమైనది. అతను ఏ పరిస్థితిలో ఉన్నా అతనికి మేలు మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం విశ్వాసి విషయంలో మాత్రమే జరుగుతుంది. అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపు కుంటాడు, అతనికి అది మేలును ప్రసాదిస్తుంది. ఒక వేళ అతనికి కష్టం కలిగితే అతను సహనం వహిస్తాడు అది అతనికి మేలు చేస్తుంది. ముస్లిం హదీసు గ్రంధం

జవాబు: సహనానికి వ్యతిరేకమైనది అసహనం అంటే అల్లాహ్ కు విధేయత చూపడంలో మరియు పాపాలకు దూరంగా ఉండటంలో అసహనం చూపడం. మాటల ద్వారా లేదా చేతల ద్వారా అల్లాహ్ యొక్క ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా దీని క్రిందికే వస్తుంది.

దానికి ఉదాహరణలు:

$ మరణాన్ని కోరుకోవడం.

$ చెంపలపై కొట్టుకోవడం.

$ బట్టలు చింపుకోవడం.

$ జుట్టు చిందర వందరగా వదిలి వేయడం.

$ తనకు త్వరగా మరణం రావాలని వేడుకోవడం.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నిశ్చయంగా ఎంతపెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం లభిస్తుంది. నిస్సందేహంగా ఎవరినైతే అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడో వారిని పరీక్షలకు గురిచేస్తాడు. ఎవరైతే వాటిలో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతని పట్ల సంతోషపడుతాడు. మరెవరైతే కష్టనష్టాల్లో సహనం కోల్పోతారో, అల్లాహ్ కూడా అతని పట్ల ఆగ్రహం చూపుతాడు. అత్తిర్మిజీ మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధం

జవాబు: ఇది సత్యం మరియు మంచితనంలో ప్రజల మధ్య సహకారం.

ఉదాహరణలు:

0 హక్కులను పునరుద్ధరించడంలో సహకారం.

0 అణచివేతను నిరోధించడంలో సహకారం.

0 ప్రజల అవసరాలు మరియు నిరుపేదల అవసరాలను తీర్చడంలో సహకారం.

0 అన్ని మంచి విషయాలలో సహకారం.

0 పాపకార్యాలు, ఇతరులకు హాని కలిగించే పనులు మరియు ఇతరులపై అరాచకాలలో సహకరించకపోవడం.

మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు: మరియు సత్కార్యాల్లో, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనులలో ఎవరితోను సహకరించకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు. [సూరతుల్ మాయిద : 2వ ఆయతు] నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక విశ్వాసితో మరొక విశ్వాసి యొక్క సంబంధం ఒక భవనం (ఇటుకలు) లాంటిది, ప్రతి ఒక్కటి మరొక దానిని బలపరుస్తుంది. ముత్తఫఖున్ అలైహి నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక ముస్లిం మరొక ముస్లిం సోదరుడు; అతడు మరొకతనికి అన్యాయం చేయడు మరియు దౌర్జన్యుడికి అతనిని అప్పగించడు. ఎవరైతే తన సోదరుని అవసరాలను తీరుస్తారో, అల్లాహ్ అతని అవసరాలను తీరుస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లింను అతని భారం నుండి విముక్తులను చేస్తారో, అల్లాహ్ ప్రళయ దినపు భారం నుండి అతనిని విముక్తి చేస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లిం (తప్పులను) కప్పిపెడతారో, అల్లాహ్ ప్రళయ దినాన (అతని తప్పులను) కప్పిపెడతాడు. ముత్తఫఖున్ అలైహి

జవాబు: 1 - అల్లాహ్ కు అవిధేయత చూపకుండా ఆయన పట్ల వినయం

2 - అసభ్యకరమైన మరియు అసంబద్ధమైన ప్రసంగాలు మానుకోవడం మరియు 'ఆవరహ్'ను బహిర్గతం చేయకుండా ఉండడం ద్వారా ప్రజల పట్ల వినయం చూపడం.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసానికి డెబ్బైలేక అరవై కు మించి శాఖలు ఉన్నాయి. అందులో "లా ఇలాహ ఇల్లల్లాహ్" వాక్యం పలకడం (విశ్వసించడం) అత్యున్నతమైనది. అయితే "మార్గం మధ్య నుండి హానికరమైన దాన్ని తొలగించడం అతి చిన్నది. ' సిగ్గు (బిడియం) విశ్వాసానికి సంబంధించిన శాఖల్లో ఒక శాఖ. ముస్లిం హదీసు గ్రంధము.

జవాబు: వృద్ధుల పట్ల దయ చూపడం మరియు వారిని గౌరవించడం.

- యువకులు మరియు చిన్నపిల్లల పట్ల దయ చూపడం.

- పేదలు, అక్కరగలవారు మరియు దిక్కులేని నిరుపేదల పట్ల దయ చూపడం

- జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా మరియు వాటికి హాని కలిగించకుండా ఉండటం ద్వారా వాటిపై దయ చూపడం.

దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, విశ్వాసుల ఉపమానం వారి స్నేహం, ఐక్యత మరియు దయ, జాలి విషయాలలో ఒక శరీరం వంటిది. శరీరం లో ఏ భాగానికైనా బాధ కలిగితే ఆ బాధను పూర్తి శరీరం అనుభవిస్తుంది. నిద్రపట్టదు, జ్వరానికి వస్తుంది. ముత్తఫఖున్ అలైహి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కరుణించే జనులపై కరుణామయుడు (అర్రహ్మాన్) కరుణిస్తాడు, మీరు భూవాసులపై కరుణించండి, ఆకాశంలో ఉన్న ప్రభువు మిమ్ములను కరుణిస్తాడు. అబూ దావూద్, అత్తిర్మిజీ హదీసు గ్రంధాలు.

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ ను ప్రేమించుట.

మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు: “విశ్వసించిన వారు అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు” [సూరతుల్ బఖరహ్: 165వ ఆయతు]

అల్లాహ్ యొక్క రసూల్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదో ఆయన సాక్షిగా, నన్ను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మరియు తన సంతానం కంటే ఎక్కువగా ప్రేమించనంత వరకు మీలో ఎవ్వరూ పరిపూర్ణ విశ్వాసి కాజాలరు. బుఖారీ హదీసు గ్రంధము

విశ్వాసుల పట్ల ప్రేమ మరియు ఒక వ్యక్తి తన కొరకు తాను కోరుకున్నట్లే వారి కొరకు కూడా మంచిని కోరుకోవడం.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: స్వయంగా తన కోసం కోరుకున్నటు వంటిదే, తన సోధరుని కోసం కూడా కోరుకునేంత వరకు మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు. బుఖారీ హదీసు గ్రంధము

జవాబు: ఉల్లాసమైన ముఖాన్ని కలిగి ఉండటం, దానితో పాటు సంతోషంతో మరియు చిరునవ్వుతో, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్నేహపూర్వకంగా ప్రజలను కలవడం.

ఇది కోపంతో నుదురు చిట్లిస్తూ, అసహ్యంతో మరియు విరోధంతో ప్రజల వైపు చూడడానికి వ్యతిరేకమైన వైఖరి.

ఉల్లాసం యొక్క ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ అనేక హదీసులు ఉల్లేఖించ బడినాయి. వాటిలో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లు అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు కూడా ఉంది: ఏ చిన్న సత్కార్యాన్ని కూడా సాధారణమైనదిగా భావించవద్దు, అది మీ సోదరుడిని చిరునవ్వుతూ పలకరించడ మైనా సరే! ముస్లిం హదీసు గ్రంధము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: చిరునవ్వుతో నీ సోదరుడిని పలకరించడం కూడా సదఖ (దానం) గా పరిగణించ బడుతుంది. తిర్మిజీ హదీసు గ్రంధము

జవాబు: ఇతరులపై కురుస్తున్న అల్లాహ్ యొక్క దీవెనలు, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఆగి పోవాలని కోరుకోవడం లేదా ఇతరులు అల్లాహ్ యొక్క ఆశీర్వాదం ఆస్వాదించడాన్ని ద్వేషించడం, ఇతరులు మంచిగా ఉండటం చూసి ఓర్చు కోలేక పోవటం.

: అల్లాహ్ ప్రకటన: మరియు అతను అసూయపడినప్పుడు, ఆ అసూయ నుండి కలిగే హాని నుండి. 5 [సూరతుల్ ఫలఖ్: 5వ ఆయతు]

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరిపై మరొకరు అసూయపడకండి మరియు ఒకరినొకరు వీపు చూపు కోకండి, అల్లాహ్ దాసులారా, సోదరులుగా మెలగిండి. బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.

జవాబు: ఇది తోటి ముస్లిం సోదరుడిని ఎగతాళి చేయడం మరియు తృణీకరించడం, ఇది అనుమతించ బడలేదు.

దీనిని పూర్తిగా ఖండిస్తున్న మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు), ఇతరులెవరినీ (పురుషులెవరినీ) ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు! అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాళ్ళు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు. [సూరతుల్ మజాదిలహ్:11వ ఆయతు]

జవాబు: ఇతరుల కంటే ఒకరు గొప్పవారు అని ఆలోచించక పోవడమే వినయం, వినమ్రత, అణుకువ; అందువలన, ఒక వ్యక్తి ప్రజలను తృణీకరించడు లేదా సత్యాన్ని తిరస్కరించడు.

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: భూమిపై వినయంగా నడిచేవారే అత్యంత కరుణామయుని దాసులు. [సూరతుల్ ఫుర్'ఖాన్: 63వ ఆయతు] వారు నిరాడంబరులు, వినయులు అని అర్థం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ ప్రసన్నత కోసం తనను తాను తగ్గించుకునే వినయం, అణుకువలతో మెలిగేవారి స్థాయిని అల్లాహ్ పెంచకుండా ఎవ్వరూ మిగలరు. ముస్లిం హదీసు గ్రంధము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, {నిశ్చయంగా అల్లాహ్ నా వైపుకు ఈ విషయాల వ'హీ (దివ్యవాణి) పంపాడు: మీరు వినమ్రతను కలిగి ఉండండి. ఒకరిపై మరొకరు దురాక్రమణ'తో హద్దు మీరవద్దు మరియు ఒకరిపట్ల మరొకరు గర్వం, అహంకారం చూప వద్దు} ముస్లిం హదీసు గ్రంధము

జవాబు: 1- సత్యంతో వ్యవహరించడంలో అహంకారం, అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు అంగీకరించకపోవడం

2 - ప్రజలతో వ్యవహరించడంలో అహంకారం, అంటే వారిని తృణీకరించడం మరియు చులకన చేయడం

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరి హృదయంలోనైతే అణువంత గర్వం, అహం ఉంటుందో అతను స్వర్గం లో ప్రవేశించడు. దానికి ఒక వ్యక్తి ఇలా అడిగాడు: "ఒక వ్యక్తి తన బట్టలు మరియు బూట్లు మంచిగా ఉండాలని ఇష్టపడితే?" అపుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా బదులు పలికారు, "నిశ్చయంగా అల్లాహ్ అందమైనవాడు మరియు ఆయన అందాన్ని ప్రేమిస్తాడు. కానీ, అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడటం. ముస్లిం హదీసు గ్రంధము

- "సత్యాన్ని తిరస్కరించడం": అంటే దానిని అంగీకరించక పోవడం.

- "వ్యక్తులను తక్కువగా చూడటం": అంటే వారిని తృణీకరించడం, నీచంగా చూడటం.

- అందంగా కనిపించేలా మంచి దస్తులు మరియు బూట్లు ధరించడం అహంకారం క్రిందికి రాదు.

జవాబు: - సరుకులోని లోపాన్ని దాచిపెట్టి, అమ్మకంలో, కొనగోలులో మోసం చేయడం.

- పరీక్షల్లో విద్యార్థులు మోసం చేసిన విధంగా చదువులో మోసం చేయడం.

- తప్పుడు సాక్ష్యం చెబుతూ మరియు అబద్ధాలు చెబుతూ మాటల్లో మోసం చేయడం.

- ఇతరులతో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించడం.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన అతనితో ఇలా అడిగారు: "ఓ ధాన్యపు కుప్ప యజమానీ, ఏమిటిది?" దానికి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: "ఓ రసూలుల్లాహ్, వర్షం పడింది (ధాన్యం వర్షంలో తడిసింది)" అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "ప్రజలు చూసేలా నీవు ధాన్యం గుట్టపై భాగాన ఈ తడిసిన ధాన్యాన్ని ఎందుకు ఉంచలేదు? మోసం చేసేవాడికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు". ముస్లిం హదీసు గ్రంధము

ధాన్యపు కుప్ప: అంటే ఆహార ధాన్యాల గుట్ట

జవాబు: ఇది ఒక ముస్లిం సోదరుడి విషయంలో అతను దగ్గరలో లేనప్పుడు అతను ఇష్టపడని వాటిని గురించి ప్రస్తావించడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రధాత.12 [సూరతుల్ హుజురాత్: 12వ ఆయతు]

జవాబు: అపనిందలు వేయడం, పుకార్లు పుట్టించడం అంటే ఇది ప్రజల మధ్య అపనమ్మకం మరియు విభేదాలను కలిగించే ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఒకరి మాటలను మరొకరికి చేరవేయడం.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అపనిందలు వేసేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు’ ముస్లిం హదీసు గ్రంధము

జవాబు: సత్కార్యాలు చేయడంలోనూ, విధులు నిర్వర్తించడంలోనూ అలసత్వం వహించడం.

వాజిబాతు (కర్తవ్య బాధ్యత) లను నిర్వర్తించడంలో అలసత్వం కూడా ఇందులోని ఒక భాగమే.:

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించ గోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ!: [సూరతున్నిసా : 48వ ఆయతు]

కాబట్టి ఒక విశ్వాసి బద్ధకాన్ని, అలసత్వాన్ని మరియు సోమరితనాన్ని విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు నచ్చే విధంగా ఈ జీవితంలో కష్టపడి పని చేయాలి.

జవాబు: 1 - ప్రశంసనీయమైన కోపం: అవిశ్వాసులు, కపటులు లేదా ఇతరులు అల్లాహ్ యొక్క విషయంలో దేనినైనా ఉల్లంఘించినప్పుడు, హద్దుమీరి నప్పుడు అల్లాహ్ కోసం వచ్చే కోపం.

2 - అంగీకరించబడని అవమానకరమైన కోపం: ఒకరు పలక కూడని మాటను నోటితో పలికించడానికి మరియు చేయకూడని పనిని అతనితో చేయించడానికి పురిగొల్పేది కోపమే.

అంగీకరించబడని అవమానకమైన కోపానికి చికిత్స:

వెంటనే ఉదూ చేయడం

నిలబడినవాడు కూర్చోవడం, కూర్చున్నవాడు పడుకోవడం

ఈ విషయంలో "కోపపడకండి" అని పలికిన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సలహాకు కట్టుబడి ఉండటం.

కోపం వచ్చినప్పుడు తనను తాను నియంత్రించుకోవడం.

శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను అని వేడుకోవడం.

మౌనంగా ఉండడం.

జవాబు: - ఇది ప్రజల తప్పులను మరియు వారు గోప్యంగా దాచి ఉంచిన వాటిని వెతకడం మరియు వాటిని బహిర్గతం చేయడం.

నిషేధితమైన గూఢచర్యానికి ఉదాహరణలు:

- వ్యక్తుల ఇళ్లలోని వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం.

- ప్రజల వ్యక్తిగత సంభాషణలు వినడానికి ప్రయత్నించడం.

మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఒకరిపై నొకరు గూఢచర్యం చేయవద్దు. [సూరతుల్ హుజురాత్: 12వ ఆయతు]

జవాబు: వృధా చేయడం అంటే డబ్బును దాని హక్కులకు భిన్నంగా అసమర్థంగా, అనవసరంగా ఖర్చు పెట్టడం.

ఇది లోభితనానికి, పిసినారితనానికి వ్యతిరేకం, అంటే డబ్బును అవసరమైనప్పుడు కూడా వాడకుండా నిలిపి ఉంచడం మరియు దానిని అవసరమైన మోతాదులో సరిగ్గా ఖర్చు చేయకపోవడం.

సరైన వైఖరి ఏమిటంటే వ్యర్థం చేయకుండా మరియు పిసినారితనం చూపకుండా, మధ్యస్థ మార్గంలో అవసరమైనప్పుడు తగిన మోతాదులో దాని హక్కు ప్రకారం ఖర్చు పెట్టడం అంటే ఉదారంగా ఉండటం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు ఎవరైతే ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చు గానీ లేక లోభత్వం గానీ చేయకుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో; 67} [సూరతుల్ ఫుర్'ఖాన్: 67వ ఆయతు]

జవాబు: - పిరికితనం అంటే భయపడకూడని దానికి భయపడటం.

ఉదాహరణకు నిజం చెప్పడానికి లేదా చెడును నిషేధించడానికి భయపడటం వంటివి.

శౌర్యం అంటే అధర్మానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం చేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించడం. ఉదాహరణకు ఇస్లాంను మరియు ముస్లింలను రక్షించేందుకు అల్లాహ్ మార్గంలో పోరాడటం, సత్యం పక్షాన పోరాడటం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దుఆలో (ప్రార్థనలో) ఇలా వేడుకునేవారు: ఓ అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుకుంటున్నాను.(అల్లాహుమ్మఇన్నీఅవూదుబిక మినల్' జుబ్'ని). రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బలహీన విశ్వాసి కంటే బలమైన విశ్వాసి అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవాడు మరియు రెండింటిలోనూ మంచి ఉంది. ముస్లిం హదీసు గ్రంధము

జవాబు: - శాపము, తిట్లు మరియు అవమానాలు.

- ఎవరినైనా హైవాన్ (జంతువు) లేదా అలాంటిది అనడం.

- అసభ్యకరమైన, అశ్లీలమైన, నీచమైన, సిగ్గుమాలిన పదాలు పలకడం.

- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వాటిని నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, - విశ్వాసి అనువాడు ‘దెప్పిపొడవడం,శపించడం ,సిగ్గుమాలినతనం మరియు దురుసుతనం లాంటి దుర్గుణాలకు ఆమడ దూరంలో ఉంటాడు. అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా హదీసు గ్రంధాలు.

జవాబు: 1- మీకు మంచి నైతికతను ప్రసాదించమని మరియు దానికి కట్టుబడి ఉండటానికి మీకు సహాయం చేయమని అల్లాహ్ ను వేడుకోవడం.

2 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల నిరంతరం శ్రద్ధ వహించడం మరియు ఆయన మిమ్మల్ని పూర్తిగా తెలుసుకుంటాడని, వింటాడని మరియు చూస్తాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం.

3 - మంచి నైతికత యొక్క ప్రతిఫలాన్ని మరియు అవి స్వర్గంలో ప్రవేశించడానికి కారణం అవుతాయని గుర్తుంచుకోవడం

4 - దుర్గుణాల యొక్క పరిణామాలను మరియు అవి నరకాగ్నిలోకి ప్రవేశించడానికి కారణం అవుతాయని గుర్తుంచుకోవడం

5 - మంచి నైతికత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ఆయన సృష్టి యొక్క ప్రేమను గెలుచుకోవడానికి దారి తీస్తుంది, అయితే దుర్గుణాలు అల్లాహ్ మరియు అతని సృష్టి యొక్క కోపానికి గురి చేస్తాయి.

6 - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను చదవడం మరియు ఆయనను ఆదర్శంగా తీసుకోవడం.

7 - మంచి వ్యక్తుల సహవాసంలో ఉండటం మరియు చెడు వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండటం