హదీసు విభాగము

జవాబు: అమీరుల్ మోమినీన్ అబీ హఫ్స ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నానని ఆయన రజియల్లాహు అన్హు తెలిపారు: ‘నిశ్చయంగా కార్యాలు, కర్మలు వాటి నియ్యతులపై (సంకల్పాలపై) ఆధారపడి ఉంటాయి ‘ప్రతి వ్యక్తికీ అతని సంకల్పాన్ని బట్టి ప్రతిఫలము లభిస్తుంది. ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు హిజ్రత్ చేస్తే (వలస వెళితే), అతని హిజ్రత్ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు (హిజ్రత్ చేసినట్లుగా) నమోదు చేయబడుతుంది. మరెవరైతే ప్రాపంచిక లాభాల కోసం హిజ్రత్ చేస్తాడో అతనికి అది లభిస్తుంది, అలాగే ఒక స్త్రీని వివాహమాడుటకు వలస పోతే, అతను సంకల్పించిన దాని ప్రకారంగానే ఆ హిజ్రత్ నమోదు చేయబడుతుంది. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ప్రతి కార్యానికీ అంటే ఉదాహరణకు సలాహ్ (నమాజు), ఉపవాసం, హజ్ యాత్ర మొదలైన వాటన్నింటికీ సంకల్పాన్ని బట్టే ప్రతిఫలం ప్రసాదించబడుతుంది.

2 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే, మరియు పూర్తి చిత్తశుద్ధితో మాత్రమే ఏ ఆచరణ అయినా చేయాలి.

రెండవ హదీసు:

జవాబు: ఉమ్ముల్ మోమినీన్ ఉమ్మే అబ్దుల్లాహ్ ఆయిషహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది”. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ధర్మంలో కొత్త కల్పిత విషయాలను, నూతన పోకడలను ప్రవేశపెట్టడం నిషేధించబడింది

2 - మతపరమైన ఆవిష్కరణల, నూతన కల్పిత పోకడలపై ఆధారపడిన ఆరాధనలు, చర్యలు తిరస్కరించబడతాయి

*మూడవ హదీసు:

జవాబు: ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘మేము మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాము, అపుడు అక్కడికి తెల్లటి దుస్తులు ధరించి, నల్లటి వెంట్రుకలు కలిగి, ఎటువంటి ప్రయాణ ప్రభావం కనిపించని ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతను నేరుగా వెళ్ళి మహనీయ ప్రవక్తకి దగ్గరగా ఆయన మోకాళ్ళకు మోకాళ్ళు ఆన్చి పెట్టి, తన చేతులు తొడలపై పెట్టుకుని కూర్చున్నాడు, పిదప "ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇస్లాం అంటే ఏమిటో నాకు బోధించండి?" అంటూ అడిగాడు. దానికి మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ బదులిస్తూ ‘ఇస్లాం అంటే ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు సందేశ హరుడని నీవు సాక్ష్యమివ్వటం, నమాజులు ఆచరించడం,(స్తోమత ఉంటే )జకాతు చెల్లించడం, రమదాన్’మాసపు ఉపవాసాలు పాటించడం, ఒకవేళ నీకు వెళ్లగలిగే శక్తి, స్తోమత ఉంటే హజ్జ్ యాత్ర చేయడం అని చెప్పారు. దానికి ఆ వ్యక్తి ‘ యదార్థం చెప్పారు’ అన్నాడు, మాకు ఆవిషయం ఆశ్చర్యం కలిగించింది అతను ప్రశ్నిస్తున్నాడు తరువాత జవాబును కూడా దృవీకరిస్తున్నాడే! మళ్ళీ ప్రశ్నిస్తూ ‘నాకు ఈమాన్ అంటే ఏమిటో చెప్పండి అని అడిగాడు, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘అల్లాహ్ ను, దైవదూతలను, ఆకాశ గ్రంధాలను, ప్రవక్తలను, మరియు పరలోకదినాన్ని నీవు విశ్వసించాలి, దాంతో పాటు విధివ్రాత మంచి ఐనా మరియు చెడుఐనా ను విశ్వసించాలి, అని చెప్పారు. అతను ‘యదార్ధం చెప్పారు మీరు అన్నాడు. ఆ పై ‘ఇహ్సాన్ ‘ అంటే ఏమిటి ఓ ప్రవక్తా? అని ప్రశ్నించాడు. నువ్వు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అలా చేయలేక పోతే అల్లాహ్ యే నిన్ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అని తెలిపారు దానికి అతను ‘ప్రళయం గురించి బోధించండి’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త ‘ఎవరినైతే ఇది అడుగుతున్నావో అతనికి ప్రశ్నిస్తున్న వాడి కంటే ఈ విషయం లో ఎక్కువ జ్ఞానం లేదు‘ అన్నారు. దానికి అతను అయితే ప్రళయ సూచనలు నాకు చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘ఒకటి ‘బానిసరాలు తన యజమానిని జన్మనిస్తుంది, రెండవ సూచన ‘నువ్వు చూస్తావు దుస్తులు లేని, కాళ్ళకు చెప్పులు లేని నగ్నులను, దరిద్రులు పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తారు. పిదప ఆ వ్యక్తి వెళ్లి పోయాడు, చాలా సేపు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు ప్రవక్త ‘ ఓ ఉమర్ ! నీకు ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా? అని అడిగారు. దానికి నేను ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసును‘ అన్నాను. అపుడు ఆయన ‘నిశ్చయంగా అతను జీబ్రయీల్ అలైహిస్సలామ్ మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చారు' అని తెలియజేశారు. ముస్లిం హదీసు గ్రంధము

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలు (మూల నియమాలు) ఐదు అని గుర్తుంచుకోండి; అవి:

షహాదతు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ - (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం).

వ ఇఖాము స్సలాహ్ - సలాహ్ (నమాజు) ను స్థాపించడం.

వ ఈతాఇ జ్'జకాహ్ - జకాతు (విధిదానం) చెల్లించడం

వ సౌము రమజాన్ - రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం

వ హజ్జ బైతుల్లాహిల్ హరామ్ - హజ్ యాత్ర చేయడం

2 - అర్కానుల్ ఈమాన్ (విశ్వాస మూల నియమాలు) లను గుర్తుంచుకోండి. అవి ఆరు:

అల్లాహ్ పై విశ్వాసం

దైవదూతలపై విశ్వాసం

దైవగ్రంధాలపై విశ్వాసం

దైవప్రవక్తలపై విశ్వాసం

ప్రళయదినముపై విశ్వాసం

ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం.

3 - రుకునుల్ ఇహ్'సాన్ (ఇహ్'సాన్ మూలనియమం). ఇహ్'సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించ లేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడని భావిస్తూ ఆయనను ఆరాధించడం.

4 - ప్రళయదినం సంభవించే సమయం , మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాని గురించి తెలియదు.

నాలుగవ హదీసు:

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసులు అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు. అత్తిర్మిజీ హదీసు గ్రంధం, ఈ హదీసు హసన్ (ఉత్తమ) హదీసు వర్గీకరణకు చెందుతుందని పలికినారు:

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - మంచి నైతికతను ప్రోత్సహించడం

2 - నైతికత యొక్క పరిపూర్ణత, విశ్వాసం యొక్క పరిపూర్ణతలోని భాగముగా పరిగణించబడుతుంది.

3 - ఈమాన్ (విశ్వాసం) పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది.

ఐదవ హదీసు:

జవాబు: అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేస్తాడో, అతను కుఫ్ర్ (అవిశ్వాసము) లేక షిర్కు (బహుదైవారాధన) కు ఒడిగట్టినట్లే, పాల్బడినట్లే. తిర్మిజీ హదీసు గ్రంధము

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

- అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం సరికాదు.

- అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం అనేది షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) గా పరిగణించబడుతుంది.

ఆరవ హదీసు:

జవాబు: అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మీలో ఏ వ్యక్తి అయినా తన ఆలుబిడ్డలకన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవులకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ అతను విశ్వాసి కాజాలడు". బుఖారీ, ముస్లిం హదీసు గ్రంధాలు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

- మొత్తం మానవజాతి కంటే అధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రేమించవలెను.

- అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.

ఏడవ హదీసు:

జవాబు: అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: స్వయంగా తమ కోసం ఏదైతే కోరుకుంటారో, అలాంటిదే తన సోధరుని కోసం కూడా కోరుకునేంత వరకు, మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఒక విశ్వాసి తనకు మంచి జరగడాన్ని ఎలా ఇష్టపడతాడో, అలాంటి మంచి ఇతర విశ్వాసుల కొరకు కూడా జరగడాన్ని ఇష్టపడాలి.

- అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.

ఎనిమిదవ హదీసు:

జవాబు : అబీ సయీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో ఆయన సాక్షిగా, ఇది (సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం) ముూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము. అల్ బుఖారీ హదీసు గ్రంధము

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - సూరతుల్ ఇఖ్లాస్ యొక్క ఘనత, విశిష్ఠత, ఔన్నత్యము.

2 - సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం, మూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము.

తొమ్మిదవ హదీసు:

జవాబు: అబీ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అనే గొప్ప పలుకులు స్వర్గం యొక్క ఖజానాలలో ఒక నిధి. అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఈ పలుకుల ఘనత ఎంత గొప్పది అంటే అది స్వర్గపు ఖజానాలలో ఒక నిధి.

2 - తన శక్తిసామర్ధ్యాలపై ఆధార పడకుండా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై మాత్రమే ఆధారపడటం.

పదవ హదీసు:

జవాబు: అన్నోమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: నిజానికి, శరీరంలో ఒక మాంసం ముక్క ఉన్నది; అది సరైన దారిలో ఉంటే, శరీరం మొత్తం సరైన దారిలోనే ఉంటుంది. ఒకవేళ అది భ్రష్టుపడితే, శరీరం మొత్తం అవినీతిమయం అయిపోతుంది. నిశ్చయంగా, అదే హృదయం. బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలలో ఉల్లేఖించబడింది.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - హృదయం సరైన దారిలో ఉండటం అనేది ఒక వ్యక్తిని బాహ్యంగానూ (మాటలలో, చేతలలో) మరియు ఆంతరంగీకంగానూ (ఆలోచనలో, సంకల్పంలో) సరైన దారిలో ఉండేలా చేస్తుంది.

2 - హృదయాన్ని సరైన దారిలో ఉంచటంపై శ్రద్ధ చూపడం, ఎందుకంటే మనిషి నిజాయితీ దానిపైనే ఆధారపడి ఉంటుంది.

:పదకొండవ అధ్యాయం

జవాబు: మఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే చివరిగా (మరణం ఆసన్నమైనపుడు) "లా ఇలాహ ఇల్లల్లాహు అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు" అని పలుకుతాడో, అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అబూ దావూద్ హదీసు గ్రంధము

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుల ఘనత, ఆ పలుకుల ఔన్నత్యం కారణంగా ఒక దాసుడు స్వర్గంలో ప్రవేశించగలడు.

2 - ఈ ప్రపంచ జీవితంలో ఒకరి చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ కావడంలోని శ్రేష్ఠత.

పన్నెండవ హదీసు:

జవాబు: అబ్దుల్లాహ్ బిన్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసి అనేవాడు ‘దెప్పిపొడవడం, శపించడం, సిగ్గుమాలినతనం మరియు దురుసుతనం మొదలైన దుర్గుణాలకు ఎంతో దూరంలో ఉంటాడు. అత్తిర్మిజీ హదీసు గ్రంధము

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - అన్ని తప్పుడు మరియు అసభ్య పలుకుల నిషేధం.

విశ్వాసి పలుకులు ఎలా ఉండాలో వివరించబడింది.

పదమూడవ హదీసు*:

అబు హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: తమకు సంబంధించని విషయాలలో తలదూర్చక పోవడం అనేది (అంటే వాటిని వదిలివేయడం) అనేది ఒక ఉత్తమ ముస్లిం యొక్క లక్షణం. అత్తిర్మిజి మరియు ఇతరు హదీసు గ్రంధాలు:

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఇతరుల ధార్మిక లేదా ప్రాపంచిక విషయాలలో జోక్యం చేసుకోకూడదు.

2 - ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది ఒకరి పరిపూర్ణ ఇస్లాంలో భాగం

పధ్నాలగవ హదీసు*:

జవాబు: అబ్దుల్లాహ్ బిన్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంధము (ఖుర్ఆన్) నుండి ఒక అక్షరం పారాయణం చేస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక పది పుణ్యాలంత ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలిఫ్, లామ్, మీమ్ మూడింటినీ కలిపి ఒకే అక్షరమని అనవద్దు గానీ అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము మరియు మీమ్ మరొక అక్షరము (గా పరిగణించబడతాయని) అనండి. అత్తిర్మిజీ హదీసు గ్రంధము:

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

1 - ఖుర్ఆన్ పారాయణం యొక్క ఘనత

2 - ఖుర్ఆన్ లో నుండి చదివే ప్రతి అక్షరానికి బదులుగా మీ కొరకు ఎన్నో పుణ్యాలున్నాయి.