తఫ్సీర్ (ఖుర్ఆన్ వ్యాఖ్యాన) విభాగము

జవాబు: సూరతుల్ ఫాతిహా మరియు దాని తఫ్సీరు (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, (1) సకల ప్రశంసలు, కృతజ్ఞతలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. (2) అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడు. (3) తీర్పుదినానికి యజమాని.(4) మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు కేవలం నిన్ను మాత్రమే సహాయం కొరకు అర్థిస్తాము.(5) మాకు ఋజుమార్గము చూపించు.(6) నీవు అనుగ్రహించిన వారి మార్గము మాత్రమే (చూపించు); నీ ఆగ్రహానికి గురి అయిన వారి మరియు మార్గభ్రష్టులైన వారి (మార్గం) కాదు.(7) [సూరతుల్ ఫాతిహ : 1-7]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

ఇది పవిత్ర ఖుర్ఆన్ ప్రారంభ సూరహ్ కాబట్టి దీనికి సూరతుల్ ఫాతిహా (తొలి అధ్యాయం) అనే ఈ పేరు పెట్టారు.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ 1 - అల్లాహ్ పేరిట నేను ఖుర్ఆన్ పఠించడం ప్రారంభిస్తున్నాను. ఆయన సహాయం కోరుతూ, ఆయన నామమును ప్రస్తావించడం ద్వారా ఆయన దీవెనలు కోరుతున్నాను.

అల్లాహ్ - నిజంగా సకల ఆరాధనలకు ఏకైక అర్హుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువుకు తప్ప మరెవ్వరికీ ఆ నామము ఇవ్వబడలేదు.

అర్రహ్మాను - కరుణాప్రధాత: సమస్తాన్ని ఆవరించి ఉన్న మహోన్నతమైన మరియు సువిశాలమైన అపార కారుణ్యం కలిగి ఉన్నవాడు.

అర్రహీమ్: విశ్వాసులపై ప్రత్యేక కృపాకటాక్షాలు కురిపించేవాడు.

2 - అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్: అన్ని రకాల ప్రశంసలు మరియు పరిపూర్ణత అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.

3 - అర్రహ్మా నిర్రహీమ్: సృష్టిలోని ప్రతిదానిని ఆవరించేటంతటి విస్తృతమైన దయాదాక్షిణ్యాలు గలవాడు మరియు విశ్వాసులపై ప్రత్యేక దయను ప్రసాదించేవాడు.

4 - మాలికి యౌమిద్దీన్: ఇది తీర్పు దినాన్ని సూచిస్తుంది.

5 - ఇయ్యాక నఆబుదు వ ఇయ్యాక నస్తయీన్: మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు సహాయం కొరకు కేవలం నిన్ను మాత్రమే అర్థిస్తాము.

6 - ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్: ఇది ఇస్లాం మరియు సున్నతుల వైపునకు మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది

7 - శిరాతల్లదీన అన్అమ్'త అలైహిమ్ గైరిల్ మగ్'దూబి అలైహిమ్ వలద్'దాల్లీన్: అల్లాహ్ యొక్క శాపానికి గురైన క్రైస్తవులు మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురైన యూదుల మార్గానికి భిన్నమైన మార్గము, ప్రవక్తలు, వారి అనుచరులు, అల్లాహ్ యొక్క నీతిమంతులైన దాసులు నడిచిన మార్గం.

సూరతుల్ ఫాతిహా చదివిన తర్వాత "ఆమీన్" (మా ప్రార్థన స్వీకరించు!) అని పలకడం సున్నతు.

జవాబు: సూరతుల్ జల్'జలహ్ మరియు దాని వ్యాఖ్యానము

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు, 1 మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు, 2 మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు, 3 ఆ రోజు అది తనలోని సమాచారాన్నంతా బహిరంగ పరిచినప్పుడు, 4 ఎందుకంటే, నిశ్చయంగా నీ ప్రభువు దానిని ఆదేశించి ఉన్నాడు. 5 ఆ రోజు తమ తమ కర్మలు చూపించబడటానికి ప్రజలను వేర్వేరు గుంపులలో తీసుకు వెళ్ళడం జరుగుతుంది. 6 మరియు అలాగే, ప్రతి ఒక్కడూ తాను రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 7 మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 8 [సూరతుల్ జల్'జలహ్: 1-8వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - ఇజా జుల్'జిలతిల్ అర్దు జిల్'జాలహా: (భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు!)

2 - వ అఖ్రజతిల్ అర్'జు అస్'ఖాలహా: (మరియు భూమి తన లోపల ఉన్న చనిపోయిన వారి అవశేషాలను మరియు ఇతర వస్తువులను బయటకు తీసుకు వచ్చినప్పుడు!)

3 - వ ఖాలల్ ఇన్'సాను మా లహా: (మరియు మనిషి గందరగోళంగా ఇలా అంటాడు: "ఎందుకు భూమి అలా కదులుతోంది మరియు కంపిస్తుంది?!")

4 - యౌమఇజిన్ తుహద్దిసు అఖ్'బారహా: (ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది.)

5 - బి అన్న రబ్బక ఔహా లహా: (ఎందుకంటే అల్లాహ్ దానిని అలా చేయమని ఆదేశించాడు.)

6 - యౌమఇజియ్ యశ్'దురున్నాసు అష్'తాతల్'లియురౌ అ'మాలహుమ్: (ఆ మహత్తర దినాన, భూమి కంపించినప్పుడు, లెక్కల కోసం ప్రజలు గుంపులుగా వస్తారు మరియు వారికి వారి ప్రాపంచిక పనులు చూపబడతాయి.)

7 - ఫమైయ్యామల్ మిస్ ఖాల జర్రతిన్ ఖైరైయ్యరహ్: (ఎవరైతే రవ్వంత మేలు చేసినా అది అతని ముందుకు తీసుకు రాబడుతుంది.

8 - వమైయ్యామల్ మిస్ ఖాల జర్రతిన్ షర్రైయ్యరహ్: (ఎవరైతే రవ్వంత కీడు చేసినా అది అతని ముందుకు తీసుకు రాబడుతుంది.)

జవాబు: సూరతుల్ ఆదియాత్ పఠనం మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానము):

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

- వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా 1 తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి; 2 తెల్లవారుజామున దాడిచేసే వాటి; 3 (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;4 (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.5 నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.6 మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.7 మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.8 ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;9 మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;10 నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని! 11 [సూరతుల్ ఆదియాత్ : 1-11 ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - : వల్'ఆదియాతి జబ్'హా 1 (అల్లాహ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్దము వినబడుతుంది.)

2 - : ఫల్ మూరియాతి ఖద్'హా 2 (నేలపై రాళ్లను బలంగా తాకినప్పుడు తమ గిట్టలతో అగ్ని మెరుపులను మెరిపించే గుర్రాలపై కూడా ప్రమాణం చేస్తున్నాడు.)

3 - : ఫల్ ముగీరాతి శుబ్'హా 3 (ఉదయాన్నే శత్రువులపై దాడి చేసే గుర్రాలపై ప్రమాణం చేస్తున్నాడు.)

4 - : ఫఅసర్'న బిహీ నఖ్'ఆ 4 (కాబట్టి, అవి తమ పరుగు ద్వారా దుమ్మును లేపుతాయి.)

5 - : ఫ వసత్'న బిహీ జమ్'ఆ 5 (శత్రువుల గుంపు మధ్యలోకి తమ రౌతులతో దూకుతాయి.)

6 - : ఇన్నల్ ఇన్'సాన లిరబ్బిహి లకనూద్ 6 (నిజానికి, మనిషి తన ప్రభువు (ఇతరులకు) ఇవ్వమని తనకు ఆజ్ఞాపించిన మంచితనాన్ని (ఇవ్వకుండా తన వద్దే) ఆపు కుంటున్నాడు.)

7 - : వ ఇన్నహు అలా జాలిక లషహీద్ 7 (మంచితనాన్ని తన వద్దనే ఆపి వేసిన దానికి స్వయంగా అతనే సాక్షి మరియు అది స్పష్టంగా ఉన్నందున అతను దానిని తిరస్కరించలేడు.)

8 - : వ ఇన్నహు లి హుబ్బిల్ ఖైరి లషదీద్ 8 (సంపదపై అతనికి ఉన్న విపరీతమైన ప్రేమ కారణంగా, అతను అత్యాశతో దానిని ఆపివేస్తాడు.)

9 - : అఫలా యఅ'లము ఇజా బుఅ'సిర మా ఫిల్'ఖుబూర్ 9 ( ఏమీ, ఇహలోకముతో ఈ మోసపోయే మానవునికి అల్లాహ్ సమాధులలో ఉన్న మృతులను లెక్క తీసుకోవటానికి మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపి నేల నుండి వెలికి తీసినప్పుడు తాను ఊహిస్తున్న విషయం కాదని తెలియదా ?!)

10 - : వ హుస్సిల మా ఫిస్సుదూర్ 10 (ఉద్దేశాలు, విశ్వాసాలు మరియు ఇతరుల హృదయాలలో దాగి ఉన్నవన్నీ చూపబడతాయి మరియు వెలుగులోకి వస్తాయి.)

11 - ఇన్న రబ్బహుమ్ బిహిమ్ యౌమఇజిన్ ల ఖబీర్ (నిశ్చయంగా వారి ప్రభువు వారి గురించి ఆ దినమున బాగా తెలిసి ఉంటాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయన వద్ద గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి దాని ప్రకారం ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.11:)

జవాబు: సూరతుల్ ఖారిఅహ్ మరియు దాని వ్యాఖ్యానం

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! 1 ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం? 2 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 3 ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.4 మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.5 అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!6 అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.7 మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!8 అతని నివాసం అధఃపాతాళమే. 9 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? (10) అదొక భగభగ మండే అగ్ని (గుండం).11 [సూరతుల్ ఖారిఅహ్ :1-11 ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (అల్ ఖారిఅహ్) 1 : ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం!.

2 - (మల్ ఖారిఅహ్)2: ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?!

3 - (వమా అద్'రాక మల్ ఖారిఅహ్) 3: (ఓ ప్రవక్తా) మీకేమి తెలుసు - ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటో? అది ప్రళయదినం!:

4 - (యౌమ యకూనున్నాసు కల్ ఫరాషిల్ మబ్'సూస్) 4: ఇది ప్రజల హృదయాలను తాకే రోజు. వారు అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్న చిమ్మటలా ఉంటారు.

5 - (వ తకూనుల్ జిబాలు కల్ ఇహ్'నిల్ మంఫూష్) 5: పర్వతాలు మెత్తటి ఊలులాగా (గాలిలో ఎగురుతూ) ఉంటాయి.

6 - (ఫ అమ్మా మన్ సఖులత్ మవాజీనుహు) 6: అపుడు, ఎవరి వద్దనైతే చెడు పనుల కంటే మంచి పనులు ఎక్కువగా ఉంటాయో,

7 - (ఫహువ ఫీ ఈషతిర్రాజియహ్) 7: అతను స్వర్గంలో ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు.

8 - (వ అమ్మా మన్ ఖఫ్ఫత్ మవాజీనుహు) 8: మరియు ఎవరి మంచి పనుల కంటే చెడు పనులు ఎక్కువగా ఉంటాయో,

9 - (ఫ ఉమ్ముహు హావియహ్) 9: అతని నివాసం నరకాగ్ని అవుతుంది.

10 - (వమా అద్'రాక మా హియ)10: (ఓ ప్రవక్తా) అదేమిటో మీకేమి తెలుసు ?

11 - (నారున్ హామియహ్) 11: అది ఒక భగభగ మండుతున్న అగ్ని

జవాబు: సూరతు తకాసుర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది 1 మీరు గోరీలలోకి చేరే వరకు.2 అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.3 మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.4 ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).5 నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు! 6 మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!7 అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు! 8 [సూరతుత్తకాసుర్: 1-8వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (అల్ హాకుముత్తకాసుర్) 1 : ఓ ప్రజలారా! సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది.

2 - (హత్తా జుర్'తుముల్ మఖాబిర్) 2 : మీరు చనిపోయి మీ సమాధులలోకి ప్రవేశించే వరకు.

3 - (కల్లా సౌఫ తఅలమూన్) 3 : వాటి పట్ల ప్రగల్భాలు పలకటం అల్లాహ్ విధేయత నుండి మిమ్మల్ని పరధ్యానంలో పడవేయటం మీకు సరి కాదు. ఈ పరధ్యానం యొక్క పర్యవసానం ఏమిటో మీరు తొందరలోనే తెలుసుకుంటారు.

4 - (సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్) 4 : అప్పుడు మీరు దాని పర్యవసానాన్ని తెలుసుకుంటారు.

5 - (కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యఖీన్) 5 : వాస్తవం ఒక వేళ మీరు అల్లాహ్ వైపు మరల లేపబడి వెళతారని మరియు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడని మీరు ఖచ్చితంగా తెలుకుని ఉంటే సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం ద్వారా మీరు పరధ్యానంలో పడేవారు కాదు.

6 - (లతరవున్నల్ జహీమ్) 6: అల్లాహ్ ప్రమాణంగా తీర్పు రోజున మీరు ఖచ్చితంగా నరకాగ్నిని చూస్తారు.

7 - (సుమ్మ లతరవున్నహా ఐనల్ యఖీన్) 7 : మళ్ళీ (చెబుతున్నాను), మీరు దానిని సంపూర్ణ నిశ్చయతతో చూస్తారు.

8 - (సుమ్మ లతుస్'అలున్న యౌమఇజిన్ అని న్నయీమ్) 8 : ఆ తరువాత అల్లాహ్ ఆ దినమున మీకు అనుగ్రహించిన ఆరోగ్యము,ఐశ్వర్యము,ఇతర వాటి గురించి మీకు తప్పకుండా అడుగుతాడు.

జవాబు: సూరతుల్ అస్ర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

కాలం సాక్షిగా (1) నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! (2) కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! (3) [1] [సూరతుల్ అస్ర్ : 1-3 వ ఆయతులు)

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (వల్ అస్ర్) 1 : సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కాలంపై ప్రమాణం చేస్తున్నాడు.

2 (ఇన్నల్ ఇన్'సాన లఫీ ఖుస్ర్) - 2 : మానవాళి అంతా పూర్తిగా నష్టాల్లో ఉన్నది.

3 - (ఇల్లల్లజీన ఆమనూ, వ అమిలుస్సాలిహాతి వతవాసౌ బిల్ హఖ్ఖి వతవాసౌ బిస్సబ్ర్) 3 : విశ్వసించి, సత్కార్యాలను ఆచరిస్తూ, అదే సమయంలో సత్యం వైపు పిలుస్తూ, సహనంతో ఉండే వారు మాత్రమే ఆ నష్టం నుండి బయటపడతారు.

జవాబు: సూతరుల్ హుమజహ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం).

అనంత కరుణాప్రదాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.1 ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!2 తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!3 ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.4 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 5 అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;6 అది గుండెల దాకా చేరుకుంటుంది.7 నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.8 పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!9 [సూరతుల్ హుమజహ్ : 1-9వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజహ్) 1 : ప్రజలను తరచుగా వెన్నుపోటు పొడిచే మరియు దూషించే ప్రతి ఒక్కరికీ బాధాకరమైన మరియు తీవ్రమైన శిక్ష ఉంది.

2 - (అల్లదీ జమఅ మాలౌ వఅద్దదహ్) 2 : ఎవడైతే డబ్బు కూడబెట్టడం, లెక్కించడం తప్ప మరి దేనిపైనా ఆసక్తి లేకుండా ఉంటాడో.

3 - (యహ్'సబు అన్న మాలహు అఖ్'లదహ్) 3 : అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తున్నాడు.

4 - (కల్లా లయుంబజన్న ఫిల్ హుతమహ్) 4 : ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది.

5 - (వమా అద్'రాక మల్ హుతమహ్) 5 : (ఓ ప్రవక్తా!) తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తునియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?

6 - (నారుల్లాహిల్ ము'ఖదహ్) 6: ఇది అల్లాహ్ యొక్క మండుతున్న అగ్ని.

7 - (అల్లతీ తత్తలిఉ అలల్ అఫ్'ఇదహ్) 7 : అది ప్రజల శరీరాల్లోకి చొచ్చుకుపోయి వారి హృదయాలను చేరుకుంటుంది.

8 - (ఇన్నహా అలైహిమ్ ము'సదహ్) 8 : అందులో హింసించబడుతున్న వారిపై అది మూసివేయబడుతుంది.

9 - (ఫీ అమదిమ్ ముమద్దదహ్) 9 : ఇది పొడవాటి మరియు పొడిగించిన నిలువు వరుసలతో మూయబడింది, తద్వారా వారిని బయటకు రానివ్వకుండా చేస్తాయి.

జవాబు: సూరతుల్ ఫీల్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? 1 ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? 2 మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు; 3 అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి. 4 ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు. 5 [సూరతుల్ ఫీల్ : 1-5వ ఆయతులు ]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (అలమ్ తర కైఫ ఫఅల రబ్బుక బిఅస్'హాబిల్ ఫీల్) 1: (ఓ ప్రవక్తా!) - అబ్రహాహ్ మరియు అతని సహచరులు, ఏనుగులతో వచ్చి, కాబాగృహాన్ని కూల్చివేయాలనుకున్నప్పుడు వారిని నీ ప్రభువు ఏమి చేసాడో నీ ప్రభువుకు తెలియదా?

2 - (అలమ్ యజ్అల్ కైదహుమ్ ఫీ తజ్'లీల్) 2 : నిశ్చయంగా దాన్ని పడవేసే వారి దుర పన్నాగమును అల్లాహ్ నిర్వీర్యం చేశాడు. కావున ప్రజలను కాబా నుండి మరల్చటమును ఏదైతే వారు పొందలేదో. మరియు దాని నుండి వారు ఏమి పొందలేదు.

3 - (వ అర్'సల అలైహిమ్ తైరన్ అబాబీల్) 3 : ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు.

4 - (తర్'మీహిమ్ బిహిజారతిమ్ మిన్ సిజ్జీల్) 4 : అవి కాల్చిన మట్టిరాళ్లను వారిపై విసిరి కొట్టాయి.

5 - (ఫజఅలహుమ్ కఅస్'ఫిమ్ మ'కూల్) 5 : అల్లాహ్ వారిని జంతువులు తిని ఉమ్మేసిన పొట్టులా చేసేసాడు.

జవాబు: సురతు ఖురైష్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటుపడ్డారు. (అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు. 2 కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి! 3 వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. 4 [సూరతు ఖురైష్ : 1-4వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (లి ఈలాఫి ఖురైష్) 1 : ఇది మక్కా ప్రజలకు సుపరిచితమైన శీతాకాలం మరియు వేసవికాలం వ్యాపార ప్రయాణాలను సూచిస్తుంది.

2 - (ఈలాఫిహిమ్ రిహ్'లత ష్షితాయి వస్"సైఫ్) 2 : శీతాకాలపు ప్రయాణంలో యెమన్ మరియు వేసవి ప్రయాణంలో వారు మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న సిరియా వంటి ప్రదేశాలకు (వ్యాపారబృందాలతో) సురక్షితంగా వెళ్ళేవారు.

3 - (ఫల్ యఅబుదూ రబ్బ హాదల్ బైత్) 3 : కావున వారు ఈ పరిశుద్ధ గృహము యొక్క ఒక్కడే ప్రభువైన అల్లాహ్ ను ఆరాధించాలి. ఎవరైతే వారి కొరకు ఈ ప్రయాణమును శులభతరం చేశారో. మరియు ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు.

4 - (అల్లజీ అత్'అమహుమ్ మిన్ జూఇవ్ వ ఆమనహుమ్ మిన్ ఖౌఫ్) 4 : అరబ్బులు అల్-హరామ్ (పవిత్ర ప్రాంగణాన్ని) మరియు దాని ప్రజలను గౌరవించేలా చేయడం ద్వారా ఈ వ్యాపార ప్రయాణాల ఏర్పాటు ఆకలిదప్పులకు గురికాకుండా మక్కా ప్రజలకు సమృద్ధిగా సంపదను అందించింది మరియు భయం నుండి వారిని రక్షించింది.

జవాబు: సూరతుల్ మాఊన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? 1 అతడే అనాధులను కసరి కొట్టేవాడు; 2 మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. 3 అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4) ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5) ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)! (6) మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో (7) [సూరతుల్ మాఊన్ : 1-7వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (అరఐతల్లజీ యుకజ్జిబు బిద్దీన్) 1 : తీర్పుదినాన ప్రతిఫలాన్ని నిరాకరించే వ్యక్తి ఎవరో తెలుసా?

2 - (ఫజాలికల్లజీ యదువ్వుల్ యతీమ్) 2 : అతడు అనాధను నిర్దయగా తిప్పికొట్టేవాడు.

3 - (వలా యహుజ్జు అలా తఆమిల్ మిస్'కీన్) 3 : అతడు పేదలకు ఆహారం పెట్టమని స్వయంగా ముందుకు అడుగు వేయడు లేదా ఇతరులను ప్రేరేపించడు.

4 - (ఫవైలుల్ లిల్ ముసల్లీన్) 4 : అలాంటి నమాజీలు నాశనమవు గాక.

5 - (అల్లజీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్) 5 : ఎవరైతే సలాహ్ పట్ల నిర్లక్ష్యం వహిస్తారో.

6 - (అల్లజీన హుమ్ యురావూన్) 6 : ఎవరైతే ఇతరులకు చూపడానికే నమాజులు మరియు మంచిపనులు చేస్తారో మరియు వాటిని అల్లాహ్ కు చిత్తశుద్ధితో అంకితం చేయరో.

7 - (వ యమ్'నఊనల్ మావూన్) 7 : మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు.

జవాబు: సూరతుల్ కౌసర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము. 1 {కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!}[2] నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు. 3 [సూరతుల్ కౌసర్ : 1-3వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఇన్నా అ'ఆతైనాకల్ కౌసర్) 1: (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు అందులో నుంచే.

2 - (ఫసల్లి లిరబ్బిక వన్'హర్) 2: కావున మీరు ఈ అనుగ్రహముపై అల్లాహ్ కు కృతజ్ఞతను తెలుపుకోండి ఆయన ఒక్కడి కొరకు మీరు నమాజును పాటించి మరియు జుబాహ్ చేసి. ముష్రికులు తమ విగ్రహాల సామిప్యము పొందటం కొరకు ఏదైతే జుబాహ్ చేసేవారో దానికి వ్యతిరేకంగా.

3 - (ఇన్న షానిఅక హువల్ అబ్'తర్) 3 : నిశ్చయంగా మిమ్మల్ని ద్వేషించేవాడు ప్రతీ మేలు నుండి తెగిపోతాడు, నామరూపాలు లేకుండా మరపింప చేయబడతాడు, ఒకవేళ అతడి ప్రస్తావన జరిగినా చెడ్డగా ప్రస్తావించ బడతాడు.

జవాబు: సూరతుల్ కాఫిరూన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!1 మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;2 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.3 మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.4 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.5 మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"6 [సూరతుల్ కాఫిరూన్ : 1-6వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) 1 : (ఓ ప్రవక్తా! వారితో ఇలా అను) - : అవిశ్వాసులారా!

2 - (లా అఆబుదు మా తఅబుదూన్) 2 : మీరు ఆరాధించే విగ్రహాలను నేను ఆరాధించను.

3 - (వలా అన్'తుమ్ ఆబిదూన మా అఆబుద్) 3 : అలాగే, నేను ఆరాధించే ఆయనను అంటే అల్లాహ్ ను మీరు ఆరాధించరు.

4 - (వలా అన ఆబిదుమ్ మా ఆబద్'తుమ్) 4 : మరియు మీరు ఆరాధించే విగ్రహాలను నేను ఎన్నటికీ ఆరాధించను.

5 - (వలా అన్'తుమ్ ఆబిదూన మా అఆబుద్) 5 : అలాగే నేను ఆరాధించే ఆయనను అంటే అల్లాహ్ ను మీరు ఎప్పుడూ ఆరాధించరు.

6 - (లకుమ్ దీనుకుమ్ వలియదీన్) 6 : మీరు కనిపెట్టిన మతం మీ కొరకే మరియు అల్లాహ్ నాకు వెల్లడించిన నా ధర్మం నా కొరకు ఉండనే ఉంది.

జవాబు: సూరతున్నసర్ మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)! 1 మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 2 అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 3 [సూరతున్నసర్: 1-3వ ఆయతులు ]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్'హ్) 1: ఓ ప్రవక్తా! అల్లాహ్ మీ ధర్మానికి విజయాన్ని మరియు బలాన్ని ప్రసాదించినప్పుడు మరియు మక్కాను జయించినప్పుడు.

2 - (వరఐతన్నాస యద్'ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్'వాజా) 2: ప్రజలు తండోప తండాలుగా ఇస్లాం స్వీకరించడాన్ని నీవు చూస్తావు.

3 - (ఫసబ్బిహ్ బిహమ్'ది రబ్బిక వస్'తగ్'ఫిర్హు ఇన్నహు కాన తవ్వాబా) 3 : కాబట్టి మీరు అది మీరు ఏ కార్యంతో పంపించబడ్డారో దాని ముగింపు దగ్గర పడినది అనటానికి సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్తుతులతో ఆయన పరిశుద్ధతను కొనియాడండి. సహాయం, విజయాల యొక్క అనుగ్రహాలకు బదులుగా ఆయనకు కృతజ్ఞత చూపుతూ, ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తాపమును బాగా స్వీకరిస్తాడు మరియు వారిని మన్నిస్తాడు.

జవాబు: సూరతుల్ మసద్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక! 1 అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు! 2 అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! 3 మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 4 ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది. 5 [సూరతుల్ మసద్ : 1-5వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్బ్) 1 : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను దుర్భాషలాడడం వల్ల ప్రవక్త యొక్క పినతండ్రి అబూ లహబ్ ఇబ్నే అబ్దుల్ ముత్తలిబ్ అతని పనులు నశించినట్లే, అతని చేతులు నశించును.

2 - (మా అగ్'నా అన్'హు మాలహు వమా కసబ్) 2 : అతని సంపద మరియు సంతానం అతనికి ఏమైనా ఉపయోగపడ్డాయా? వారు అతనిని హింస నుండి రక్షించలేరు లేదా అతనిని కరుణింపబడేలా చేయలేరు.

3 - (సయస్'లా నారన్ జాత లహబ్) 3 : తీర్పుదినాన, అతను నరకాగ్నిలోకి ప్రవేశించబడతాడు, అక్కడ అతను దాని వేడిని అనుభవిస్తాడు.

4 - (వమ్'రఅతుహు హమ్మాలతల్ హతబ్) 4 : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దారిలో ముళ్ళు విసిరి గాయపరిచే అతని భార్య ఉమ్మే జమీల్ కూడా నరకాగ్నిలో చేర్చబడుతుంది.

5 - (ఫీ జీదిహా హబ్'లుమ్ మిమ్ మసద్) 5 : ఆమె మెడకు బిగుతైన తాడు బిగించబడి, నరకాగ్నిలోకి విసిరి వేయబడుతుంది.

జవాబు: సూరతుల్ ఇఖ్లాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

{ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2) {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.} 3 {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} [సూరతుల్ ఇఖ్లాస్: 1-4వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఖుల్ హువల్లాహు అహద్) 1 : (ఓ ప్రవక్తా! ప్రకటించు): ఆయనే అల్లాహ్, ఏకైకుడు; ఆయన తప్ప ఆరాధనలకు అర్హుడైన ఆరాధ్యుడు లేడు.

2 - (అల్లాహుస్ సమద్) 2 : సృష్టి యొక్క అన్ని అవసరాలు ఆయన మాత్రమే తీర్చగలడు.

3 - (లమ్ యలిద్ వలమ్ యూలద్) 3 : ఆయన ఎవరినీ కనలేదు మరియు ఆయనను ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు.

4 - (వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్) 4 : సృష్టిలో ఏదీ ఆయనలా లేదు.

జవాబు: సూరతుల్ ఫలఖ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3 మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4 : అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 : [సూరతుల్ ఫలఖ్ : 1-5వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఖుల్ అవూదు బిరబ్బిల్ ఫలఖ్) 1 : ఓ ప్రవక్తా! ప్రకటించు: నేను ఉదయం యొక్క యజమానిని ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాను.

2 - (మిన్'షర్రిల్ మా ఖలఖ్) 2 : హానికరమైన జీవుల చెడు నుండి

3 - (వ మిన్'షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్) 3 : మరియు విషజంతువులు మరియు దొంగలు వంటి రాత్రిపూట కనిపించని చెడుల నుండి నేను అల్లాహ్ను శరణు కోరుతున్నాను.

4 - (వ మిన్'షర్రిన్ నఫ్ఫా సాతి ఫిల్ ఉఖద్) 4 : మరియు ముడుల మీద ఊదుతున్న మాంత్రికుల చెడు నుండి నేను అల్లాహ్ వద్ద శరణు కోరుతున్నాను.

5 - (వ మిన్'షర్రి హాసిదిన్ ఇజా హసద్) 5 : మరియు అల్లాహ్ వారికి ప్రసాదించిన దీవెనలను చూసి ఓర్పుకోలేక, ప్రజలను ద్వేషించే మరియు అసూయపడే వ్యక్తి యొక్క చెడు నుండి. ఆ ప్రజలు ఇకపై అలాంటి ఆశీర్వాదాలను పొందకూడదని మరియు వారికి హాని కలిగించాలని ఆ దుష్టులు కోరుకుంటారు.

జవాబు: సూరతున్నాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1) మానవుల చక్రవర్తి. (2) మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)! 3 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; 4 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!5 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!6 [సూరతున్నాస్: 1-6వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

1 - (ఖుల్ అవూదు బిరబ్బిన్నాస్) 1 : ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించు: నేను మానవాళి ప్రభువు వద్ద రక్షణ మరియు ఆశ్రయం పొందుతున్నాను.

2 - (మలికిన్నాస్) 2 : ప్రజల చక్రవర్తి. ఆయన తాను తలచుకున్న వాటితో వారిలో కార్య నిర్వహణ చేస్తాడు. ఆయన తప్ప వారికి ఏ చక్రవర్తి లేడు.

3 - (ఇలాహిన్నాస్) 3 : వారి నిజమైన ఆరాధ్యుడు, మరియు వారి ఆరాధనల కొరకు ఆయనను మించిన వేరే ఆరాధ్యుడు మరొకడు లేడు.

4 - (మిన్'షర్రిల్ వస్'వాసిల్ ఖన్నాస్) 4 : ప్రజల వద్ద గుసగుసలాడే షైతానుల యొక్క చెడు నుండి.

5 - (అల్లజీ యువస్'విసు ఫీ సుదూరిన్నాస్) 5 : ఎవరైతే మానవాళి హృదయాలలో గుసగుసలాడుతూ ఉంటారో.

6 - (మినల్ జిన్నతి వన్నాస్) 6 : అలా గుసగుసలాడేది జిన్ నుండి కావచ్చు లేదా మానవజాతి నుండి కావచ్చు అని దీని అర్థం.