జవాబు: అత్తహారతు: అంటే అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) మరియు ఖబస్ (పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి పరిశుద్ధత పొందుట.
అత్తహారతుల్ ఖబస్ (నజాసహ్, పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే ఒకరి శరీరం నుండి, బట్టల నుండి లేదా సలాహ్ (నమాజు) చేసే స్థలం నుండి భౌతిక మలినాలను తొలగించడం.
తహారతుల్ హదస్: అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే స్వచ్ఛమైన నీటితో వుజు చేయడం; లేదా గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేయడం; లేదా నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించడం కష్టంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ (పరిశుభ్రమైన మట్టి ద్వారా శుద్ధీకరణ) చేయడం.
జవాబు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఒక ముస్లిం దాసుడు లేదా ఒక మోమిన్ దాసుడు (ముస్లిం లేదా మోమిన్ పదాలలో ఏది అన్నారనే దానిపై ఉల్లేఖకునికి సంశయం ఉంది ) వుజు ఆచరిస్తున్నపుడు తన ముఖాన్ని నీటితో శుభ్రపరుస్తాడు ఆ క్రమం లో అతని ముఖం నుండి కళ్ల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేదా ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. చేతులు శుభ్రపరిచినపుడు ఆ చేతుల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేక ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. కాళ్ళు శుభ్రపరిచినప్పుడు వాటి ద్వారా జరిగిన పాపాలన్నీ తుడిచి వేయబడతాయి. చివరికి అతను తన పాపాలన్నింటి నుండి పరిశుద్దుడవుతాడు. ముస్లిం హదీసు గ్రంధము
జవాబు: ముందుగా అరచేతులు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
తత'మజ్ మజ, తస్'తంషఖ్ మరియు తస్'తంసిర్ మూడు సార్లు చేయాలి.
అల్ మజ్'మజహ్: అంటే నోటిలో నీరు పట్టి, బాగా పుక్కిలించి, బయటకు ఉమ్మేయాలి.
అల్ ఇస్తింషాఖ్: అంటే ముక్కులో నీరు ఎక్కించి, ఎడమచేతి వేళ్ళతో ముక్కు లోపల శుభ్రం చేసుకోవటం.
తస్'తంసిర్: ముక్కు లోపల ఎడమచేతి వ్రేళ్ళతో శుభ్రపరుచుకున్న తరువాత ముక్కును పట్టుకుని, ఆ నీటిని బయటికి చీదడం.
ఆ తరువాత, ముఖాన్ని మూడు సార్లు కడగాలి
ఆ తరువాత, మోచేతుల వరకు రెండు చేతులూ మూడు సార్లు చేతులు కడగాలి (ముందుగా కుడిచేయి కడగాలి, తరువాత ఎడమచేయి).
ఆ తరువాత, రెండు తడి అరచేతులను దగ్గరగా చేర్చి, తలపై తుడవాలి (నుదురు పైభాగం నుండి ప్రారంభించి, వెనక్కు), రెండు చెవుల లోపలి భాగాన్ని చూపుడు వ్రేలితో, మరియు చెవి వెనుక భాగాన్ని బొటన వ్రేలితో శుభ్రపరచుకోవాలి.
ఆ తరువాత, రెండు పాదాలను చీలమండలాల వరకు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. (ముందుగా కుడిపాదం కడగాలి, తరువాత ఎడమపాదం).
దీనితో మీ వుజు పూర్తి అవుతుంది. ఉస్మాన్, అబ్దుల్లాహ్ బిన్ జైద్ మొదలైన వారి (రదియల్లాహు అన్హుమ్) ఉల్లేఖనల ఆధారంగా సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీసు గ్రంధాలలో ప్రామాణికంగా నమోదు చేయబడిన అత్యంత పరిపూర్ణమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ పద్ధతి. వుజులో శుభ్రపరచుకోవలసిన శరీర అవయవాలు ఒక్కోసారి లేదా రెండు రెండు సార్లు కడగ వలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రామాణికంగా సహీహ్ అల్ బుఖారీ మరియు ఇతర హదీసు గ్రంధాలలో నమోదు చేయబడింది.
జవాబు: వుజులో విధిగా చేయవలసిన ఆచరణలు ఇక్కడ పేర్కొనబడినాయి. వాటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టినా, ఒకరి వుజు చెల్లుబాటు కాదు. అవి:
1 - ముఖం కడుక్కోవడం, నోట్లో మరియు ముక్కులో నీరు ఎక్కించి శుభ్రం చేసుకోవడం.
2 - రెండు చేతులూ మోచేతుల వరకు కడుక్కోవడం.
3 - తడి అరచేతులతో తలపై తడపడం మరియు రెండు చెవులను శుభ్రం చేసుకోవడం.
4 - రెండు పాదాలు చీలమండలాల వరకు శుభ్రంగా కడుక్కోవడం.
5 - ముందుగా ముఖాన్ని కడుక్కోవడం, తర్వాత చేతులు కడుక్కోవడం, తర్వాత తలపై తుడవడం, చివరగా పాదాలు కడుక్కోవడం వరుస క్రమంలో పాటిస్తూ, నిర్దేశించిన క్రమాన్ని అనుసరించడం.
6 - వరుస క్రమంలో అంటే అవయవాలు పొడిగా మారడానికి అనుమతించే సమయ వ్యవధి అధిగమించకుండా వుజు అవయవాలను వరుసగా ఒకదాని తరువాత ఒకటి కడగడం.
వుజు మొత్తం ఒకేసారి పూర్తి చేయకుండా, ఒకసారి సగం మాత్రం చేసి, కొంతసేపటి తరువాత మిగతా సగం చేస్తే ఆ వుజు చెల్లదు.
జవాబు: సునన్ అల్ వుజు అంటే వీటిని పూర్తి చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, ఒకవేళ పూర్తి చేయక పోతే ఎలాంటి దోషమూ లేదు మరియు అతని వుజు చెల్లుతుంది.
1 - తస్మియహ్ - బిస్మిల్లాహ్ పదాలతో ప్రారంభించడం.
2 - అస్,సివాక్ (పంటిపుల్లతో పళ్ళు శుభ్రం చేసుకోవడం)
3 - రెండు అరచేతులు శుభ్రం చేసుకోవడం.
4 - వ్రేళ్ళ మధ్య శుభ్రం చేసుకోవడం
5 - ఉదూలో కడగ వలసిన అవయవాలను రెండోసారి మరియు మూడోసారి కడగడం
6 - ప్రతిసారీ కుడువైపుతో ప్రారంభించడం
7 - వుజు పూర్తి చేసిన తరువాత అల్లాహ్ యొక్క ధ్యానం (అద్కార్) చేయడం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ వ అష్'హదు అన్న ముహమ్మదన్ అబ్'దుహూ వరసూలుహూ. వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని,ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
8 - వుజు చేసిన తరువాత రెండు రకాతుల సలాహ్ చేయడం
జవాబు: 1 - తహారతు (ఆచార శుద్ధి) స్థితిలో ఉన్నప్పుడు అంటే వుజు చేసిన తర్వాత తోలు సాక్సు ధరించడం.
2 - తోలు సాక్సు తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే అశుద్ధమైన వాటిపై మసహ్ చేయడం (తుడవడం) అనుమతించబడదు.
3 - తోలు సాక్సు తప్పనిసరిగా చీలమండలంతో సహా మొత్తం పాదాలను కప్పి ఉంచాలి.
4 - తోలు సాక్సు పై తుడవడం తప్పనిసరిగా పరిమిత వ్యవధి లోపలే ఉండాలి - అంటే ఒకచోట స్థిరంగా నివాసిస్తున్న వ్యక్తి కొరకు ఆ పరిమిత వ్యవధి ఒక పగలు మరియు రాత్రి. అలాగే ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.
జవాబు: ఇది ఒకరి తడి వేళ్లను అతని కాలి వేళ్లపై ఉంచి అంటే తోలు సాక్సుపై ఉంచి, వాటిని పాదం పైభాగం (మోకాలి క్రింది భాగం) వరకు మసహ్ చేయాలి (తుడవాలి); అయితే కుడి చేతితో కుడి పాదంపై మరియు ఎడమ చేతితో ఎడమ పాదంపై మసహ్ చేయాలి (తుడవాలి). మసహ్ చేసే (తుడిచే) సమయంలో వేళ్లను వేరు వేరుగా ఉంచాలి మరియు పునరావృతం చేయకుండా ఒకసారి మాత్రమే చేయాలి.
జవాబు: 1 - మసహ్ (తోలు మేజోళ్ళపై తుడవడం) కోసం తెలుప బడిన నిర్దిష్ట వ్యవధి గడువు పూర్తి కావడం. ఎందుకంటే ఆ వ్యవధి ముగిసిన తర్వాత మరలా వాటిపై మసహ్ చేయడం (తోలు మేజోళ్ళపై తుడవడం) అనుమతించ బడలేదు: ఆ వ్యవధి - ఒకచోట స్థిరంగా నివసిస్తున్న వ్యక్తి కొరకు ఒక పగలు మరియు రాత్రి, మరియు ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.
2 - వుజు స్థితిలో తొడిగిన తోలు మేజోళ్ళను వాటిలో ఒకదానిని లేదా రెండింటిని విడవడం.
1 - అల్ ఇస్లాం: అవిశ్వాసుల సలాహ్ (నమాజు) చెల్లదు.
2 - అల్ అఖల్: మతిస్థిమితంలేని వారి సలాహ్ చెల్లదు.
3 - అల్ తమియ్యజ్: బుద్ధి, వివేకం లేని పిల్లల సలాహ్ చెల్లదు.
4 - అన్నియ్యహ్: సంకల్పం
5 - సలాహ్ యొక్క నిర్ణీత సమయంలో ప్రవేశించడం.
6 - అల్ హదస్ (ఆచార అశుద్ధి) నుండి పరిశుభ్రము కావడం.
7 - అల్ నజాసహ్ (పదార్థ అశుద్ధి) ను తొలగించడం.
8 - అవ్రహ్ (తప్పనిసరిగా కప్పుకోవలసిన శరీర భాగాలను) కప్పుకోవడం.
9 - ఖిబ్లాకి అభిముఖంగా నిలబడడం.
జవాబు: మొత్తం పధ్నాలుగు అర్'కానులు: అవి
వాటిలో మొదటిది: తప్పనిసరి ఫర్ద్ సలాహ్ లో (నమాజులో) నిటారుగా నిలబడటం (ఆరోగ్యంగా ఉంటే).
"అల్లాహు అక్బర్" అనే పదాలతో తక్బీర్ అల్ ఇహ్రామ్ పలకడం.
సూరతుల్ ఫాతిహా పఠించడం
రుకూ చేయడం అంటే తన తల మరియు వీపు ఒకే ఎత్తులో ఉండేటట్లుగా తన వీపును ముందుకు వంచడం.
రుకూ నుండి లేవడం
నిటారుగా నిలబడటం
సుజూద్ (సాష్టాంగం): నుదురు, ముక్కు, రెండు అరచేతులు (చెవులకు దగ్గరలో), రెండు మోకాళ్ళు, రెండు పాదాల బొటన వ్రేళ్ళు నేలపై ఆన్చి, సాష్టాంగం చేయడం.
సజ్దా నుండి పైకి లేవడం
రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం
ఇక్కడ కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, కాలి వేళ్లను ఖిబ్లా దిశలో ఉంచుతూ, ఎడమ పాదం మీద కూర్చోవడం అనేది సున్నతు చర్య.
ప్రశాంతత: సలాహ్ (నమాజు) లోని ప్రతి భంగిమను, చర్యను ప్రశాంతంగా, మనస్సు లగ్నం చేసి మరీ ఆచరించవలెను.
చివరి తషహ్హుద్ పఠించడం.
తషహ్హుద్ పఠించడం కొరకు కూర్చోవడం.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ ముందుగా కుడివైపు తల త్రిప్పాలి, ఆ తరువాత ఎడమ వైపు తల త్రిప్పాలి.
పైన పేర్కొనబడిన చర్యలను ఇదే వరుసక్రమంలో ఆచరించడం. అంటే ఒకవేళ ఎవరైనా కావాలని రుకూ చేయకుండా ముందు సజ్దా చేసి, ఆ తరువాత రుకూ చేసినట్లయితే, అతని సలాహ్ చెల్లదు. ఒకవేళ మతిమరుపు వలన అలా జరిగితే, అతను లేచి నిలుచొని ముందుగా రుకూ చేసి, తరువాత సజ్దా చేయవలెను.
జవాబు: సలాహ్ (నమాజు)లో వాజిబాతులు తొమ్మిది. అవి,
1 - తక్బీర్ అల్ ఇహ్రామ్ కాకుండా మిగిలిన తక్బీర్లు
2 - ఇమాం మరియు ఒంటరిగా సలాహ్ చేస్తున్న వారు "సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్ (తనను ఎవరైనా స్తుతిస్తే, అల్లాహ్ దానిని ఆలకిస్తాడు)" అని పలకడం.
3 - "రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి)" అని పలకడం.
4 - రుకూలో "సుబహాన రబ్బియల్ అజీమ్" అని మూడు సార్లు పలకడం.
5 - సజ్దాలో "సుబహాన రబ్బియల్ అఆలా" అని మూడుసార్లు పలకడం.
6 - రెండు సజ్దాల మధ్య విరామంలో (జల్సా భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు), రబ్బిగ్ఫిర్లీ అని పలకడం.
7 - తషహ్హుద్ మొదటి భాగం పఠించడం.
8 - తషహ్హుద్ మొదటి భాగాన్ని పఠించడం కొరకు కూర్చోవడం.
జవాబు: మొత్తం 11 సునన్ అస్సలాహ్ ఉన్నాయి.
1 - దుఆ అల్ ఇస్తఫ్తాహ్ అంటే తక్బీర్ అల్ ఇహ్రామ్ తరువాత "సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, వ తబారకస్ముక, వ తఅఆలా జద్దుక, వలా ఇలాహ గైరుక" అని పలకడం.
2 - తఅ'వ్వుజ్ అంటే అఊజు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ అని పలకడం.
3 - బస్మలహ్ అంటే బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అని పలకడం.
4 - ఆమీన్ అని పలకడం
5 - సూరతుల్ ఫాతిహా తరువాత వేరే ఏదైనా సూరహ్ గానీ, ఏదైనా సూరహ్ లోని కొన్ని ఆయతులు గానీ పఠించడం.
6 - బిగ్గరగా ఖుర్ఆన్ పారాయణం చేసే సలాహ్ లలో వెనుక ఉన్న వారికి చక్కగా వినిపించేలా ఇమామ్ తన కంఠస్వరాన్ని పెంచి, ఖుర్ఆన్ వచనాలు పఠించడం.
7 - తహ్మీద్ పలకడం (అల్లాహ్ ను స్తుతించడం) - "మిలస్సమావాతి వ మినల్ అర్ద్, వ మినల్ మా షి'త మిన్ షైఇన్ బఆద్" అనే పలుకులు ఇమాం నుండి విన్న తరువాత అల్హందులిల్లాహ్ అంటూ అల్లాహ్ ను స్తుతించడం.
8 - తస్బీహ్ - రుకూలో ఎక్కువసార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ అనే పలుకులను ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
9 - సజ్దాలో ఒకటి కంటే ఎక్కువ సార్లు తస్బీహ్ చదవటం.
10 - రబ్బిగ్'ఫిర్లీ అనే పదాలను రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
11 - చివరి తషహ్దుద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం. ఆ తరువాత దుఆలు చేసుకోవడం.
నాలుగవది: సునన్ అల్ అఫ్ఆల్: సలాహ్ లో సిఫారసు చేయబడిన సంజ్ఞలు.
1 - తక్బీర్ అల్ ఇహ్రామ్ పలుకులతో రెండు అరచేతులను ఖిబ్లా దిశలో చెవుల క్రింది భాగం వరకు పైక లేపడం.
2 - రుకూలోకి వెళ్ళే ముందు రఫ్ ఉల్ యదైన్ చేయడం
3 - రుకూ నుండి పైకి లేచిన తరువాత రఫ్ ఉల్ యదైన్ చేయడం.
4 - రఫ్ ఉల్ యదైన్ తరువాత రెండు చేతులను క్రిందికి దించడం.
5 - ఎడమ చేతిపై కుడి చేతిని కట్టడం.
6 - సజ్దా చేసే స్థానంపై మీ కంటిచూపును ఉంచడం.
7 - నిటారుగా నిలబడినప్పుడు రెండు కాళ్ళను సముచితమైన దూరంలో ఉంచడం.
8 - రుకులో రెండు అరచేతులతో మరియు చేతివ్రేళ్ళతో రెండు మోకాళ్లను గట్టిగా పట్టుకోవడం, ఒకరి వీపును నేలకు సమాంతరంగా, తిన్నగా ఉంచుతూ, తల మరియు వీపు సమంగా ఉండేలా ముందుకు వంగడం.
9 - సజ్దా అవయవాలను నేలపై ప్రశాంతంగా ఆన్చడం, అవన్నీ నేలను తాకేలా చూసుకోవడం.
10 - సజ్దాలో రెండు మోజేతులను పక్కల నుండి దూరంగా ఉంచడం, పొత్తికడుపు తొడల నుండి మరియు తొడలను కాళ్ళ నుండి దూరంగా ఉంచడం; మోకాళ్లను వేరుగా ఉంచడం మరియు పాదాల కాలి వేళ్లు వేరు చేయడం మరియు వేళ్ళ మొన భాగాన్ని నేలకు ఆన్చడం; అరచేతులు నేలపై ఆన్చుతూ, వాటి వేళ్ళు కలిపి ఉంచి, మోజేతులను భుజాలకు సమాంతరంగా ఉంచడం.
11 - రెండు సజ్దాల మధ్య మరియు మొదటి తషహ్హుద్ సమయంలో కూర్చున్నప్పుడు ఇఫ్తీరాష్ (ఎడమ పాదాన్ని దాని వైపే ఉంచి, దానిపై కూర్చోవడం; మరియు కుడి పాదాన్ని ఖిబ్లా వైపు కాలి వేళ్ల మొనలు ఉండేలా చేయడం) చేయడం. అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో తవర్రుక్ (ఎడమ వెనుక భాగాన్ని (పిరుదులను) నేలపై పర్చి, దానిపై కూర్చోవడం; కుడి పాదం కాలి వేళ్ల ఖిబ్లా వైపు ఉంచి, పాదాన్ని నిటారుగా ఉండేలా చేయడం; మరియు ఎడమ పాదాన్ని కుడి పాదం కింద ఉండేలా చేయడం) చేయడం.
12 - రెండు సజ్దాల మధ్య మరియు తషహ్హుద్ సమయంలో చేతి వ్రేళ్ళను దగ్గరగా ఉంచి, రెండు అరచేతులను రెండు తొడల మీద పెట్టడం; అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో, తన కుడి చేతి యొక్క చిన్న మరియు ఉంగరపు వేళ్లను (చివరి రెండు వేళ్ళను) బిగించి, బొటనవేలు మరియు మధ్య వేళ్లతో ఉంగరాన్ని తయారు చేయవచ్చు మరియు అల్లాహ్ నామం ప్రస్తావిస్తున్నప్పుడు చూపుడు వేలును పైకి లేపి చూపవలెను.
13 - తస్లీమ్ చేస్తున్నప్పుడు ముందుగా ముఖాన్ని కుడివైపుకు త్రిప్పాలి, ఆ తరువాత ఎడమవైపునకు.
జవాబు: సలాహ్ (నమాజు) చేసే పద్ధతి
1 - ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.
2 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ సలాహ్ (నమాజు) చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.
3 - భుజాల ఎత్తులో ఖిబ్లాకు అభిముఖంగా అరచేతులు ఉండేలా రెండు చేతులు పైకి ఎత్తి, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ తక్బీర్ అల్ ఇహ్రామ్ పూర్తి చేయాలి.
4 - ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
5 - ఈ దుఆ చేస్తూ సలాహ్ ప్రారంభించండి: అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖ స్సౌబల్ అబ్యజి మినద్'దనసి, అల్లాహుమ్మగ్'సిల్నీ మిన్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జీ వల్ బర్'దీ (ఓ అల్లాహ్! మీరు తూర్పును పశ్చిమం నుండి వేరు చేసినట్లుగా, నా పాపాల నుండి నన్ను వేరు చేయుము. ఓ అల్లాహ్! తెల్లని వస్త్రం నుండి మరకలను తొలగించినట్లు నా పాపాల నుండి నన్ను శుభ్రపరచు. ఓ అల్లాహ్! మంచు, నీరు మరియు వడగళ్ళతో నా పాపాలను కడిగివేయి).
లేదా ఈ దుఆ చేయండి: "సుబహానకల్లాహుమ్మ వబిహమ్'దిక వతబారకస్ముక వతఆలా జద్'దుక వలా ఇలాహ గైరుక". (ఓ అల్లాహ్! నీ ప్రశంసతో నీకు మహిమ కలుగునుగాక! నీ నామము శుభమైనది మరియు నీ మహిమ శ్రేష్ఠమైనది. మరియు నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు)
6 - అల్లాహ్ వద్ద ఈ పదాలు పలుకుతూ శరణు వేడుకోండి. అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను) 7 - ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించ వలెను. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1) అల్హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ (స్తుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి).(2) అర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడు) (3) మాలికి యౌమిద్దీన్ (తీర్పుదినానికి యజమాని). (4) ఇయ్యాక నఆబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము).(5) ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్ (మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి).(6) శిరాతల్లదీన్ అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ (నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు).(7) [సూరతుల్ ఫాతిహ : 1-7]
ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను. :
8 - తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఉదయపు ఫజ్ర్ సలాహ్ లో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయ వలెను.
9 - ఆ తరువాత (అల్లాహు అక్బర్) తక్బీర్ పలుకుతూ, రెండు చేతులూ భుజాల వరకు ఖిబ్లా దిశలో పైకెత్తి, దించుతూ రుకూలోకి వెళ్ళవలెను. రుకూలో చేతి వ్రేళ్ళను వ్యాపింపజేసి, రెండు అరచేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకుని, వీపును తిన్నగా అంటే నేలకు సమాంతరంగా ఉంచి, తల మరియు నడుము ఒకే ఎత్తులో ఉండేటట్లు చూడటం సున్నతు.
10 - రుకూలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ (లోపాలూ, కొరతలకు అతీతుడైన నా ప్రభువుకే సకల కీర్తనలు), ఇంకా ఇలా కూడా పలికితే మంచిది: సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్లీ ((ఓ అల్లాహ్! నీవు ఎలాంటి లోపాలకూ, కొరతలకూ అతీతుడవు. ఓ అల్లాహ్, నన్ను క్షమించు)
11 - ఆ తరువాత రుకూ నుండి తన తల పైకెత్తుతూ, మరలా రెండు చేతులు భుజాల వరకు పైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదహ్ (అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటాడు) అని పలక వలెను. ఇమాంను అనుసరిస్తూ, ఆయన వెనుక సలాహ్ చేస్తున్నవారు, బదులుగా ఇలా పలక వలెను రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ మా ప్రభూ! సకల స్తోత్రములు నీకే శోభిస్తాయి).
12 - అలా పైకి లేచి, నిటారుగా నిలబడిన తరువాత రబ్బనా వలకల్ హమ్'ద్ మిల్అ స్సమావాతి వ మిల్ అల్ అర్'ది, వ మా బైనహుమా వ మిల్అ మా షిఅత మిన్ షైయిన్ బఆదు. అహ్లలథ్థనాయి వల్ మజ్ది అహఖ్'ఖు మా ఖాలల్ అబ్'దు వ కుల్లునా లక అబ్దున్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత వలా మూతియ లిమా మనఆత వలా యన్'ఫవు దల్ జద్ది మిన్కల్ జద్దు (ఆకాశాల నిండుగా, భూమి నిండుగా మరియు వాటి మధ్య నున్న వాటి నిండుగా, ఆ తరువాత నీవు తలచిన వాటన్నింటి నిండుగా (ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి). సమస్త ప్రశంసలు మరియు ఘనతలు గలవాడవు. దాసుడు సెలవిచ్చిన మాట అత్యంత సత్యమైనది. మేమంతా నీకు దాస్యం చేయువారము. ఓ అల్లాహ్! నీవు ఇవ్వదలిస్తే అడ్డగించే వాడెవ్వడూ లేడు. మరియు నీవు ఇవ్వదలచక పోతే దాన్ని ప్రసాదించే వాడెవ్వడూ లేడు. ఏ గొప్పవాని గొప్పతనమూ నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్నీ చేకూర్చదు) అని పలుక వలెను.
13 - "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ, మొదటి సజ్దాలోకి వెళ్ళ వలెను. శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయవలెను: నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచ వలెను.
14 - సజ్దాలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ ఆలా (సర్వోన్నతుడైన నా ప్రభువు అపర పరిశుద్ధుడు) పలక వలెను. ఇంకా ఇలా పలికితే మంచిది - సుబహానక అల్లాహుమ్మ, రబ్బనా వ బిహమ్'దిక అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభూ! నేను నిన్నుస్తుతిస్తున్నాను. (కనుక) ఓ అల్లాహ్ నన్ను క్షమించు)
15 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి తల పైకెత్త వలెను.
16 - ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశాంతంగా కూర్చోవలెను.
17 - రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయవలెను. రబ్బిగ్'ఫిర్లీ వర్'హమ్'నీ, వహ్'దినీ, వరజుఖ్'నీ, వజ్'బుర్'నీ, వఆఫినీ (ఓ నా ప్రభూ నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు సన్మార్గం వైపు మార్గదర్శకం చేయి, నాకు ఉపాధి ప్రసాదించు, నా నష్టాన్ని పూడ్చు, నాకు ఉన్నత స్థానాన్ని ప్రసాదంచు.)
18 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ మొదటిసారి చేసినట్లుగానే చేస్తూ, మొదటి సజ్దాలో ప్రార్థించినట్లుగానే ప్రార్థిస్తూ, రెండవ సారి సజ్దా చేయ వలెను.
19 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండవ సజ్దా నుండి లేచి నిలబడ వలెను (ఇక్కడితో మొదటి రకాతు పూర్తయింది), మొదటి రకాతులో పలికినట్లుగా, ఆచరించినట్లుగానే చేస్తూ రెండవ రకాతు పూర్తి చేయ వలెను.
20 - రెండవ రకాతులోని రెండవ సజ్దా చేసిన తరువాత రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లుగానే లేచి కూర్చో వలెను.
21 - అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను. అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను,
22 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
23 - ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల సలాహ్ (నమాజు) చేస్తున్నట్లయితే, మొదటి తషహ్హుద్ లో అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వద్ద ఆపి వేయవలెను.
24 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు చేతులు మరలా ఖిబ్లా వైపు భుజాల వరకు ఎత్తి, మూడవ రకాతు కొరకు లేచి నిలబడ వలెను.
25 - ఆ తరువాత రెండవ రకాతు చేసినట్లుగానే మూడవ రకాతులో చేయవలెను. అయితే, సూరతుల్ ఫాతిహా పఠనం తరువాత ఖుర్ఆన్ లోని మరోభాగం పఠించనవసరం లేదు.
26 - మొదటి తషహ్హుద్ లో కూర్చున్నట్లుగానే ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి లేదా కుడికాలి క్రింద ఎడమ కాలు క్రాస్ గా తీసుకు వచ్చి, ఎడమ పిరుదుపై కూర్చుని; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశంతంగా కూర్చోవలెను. (గమనిక: ఒకవేళ నాలుగు రకాతుల సలాహ్ చేస్తున్నట్లయితే, మూడవ రకాతులో కూర్చోకుండా, లేచి నిలబడి రెండవ రకాతు పూర్తి చేసినట్లుగానే నాలగవ రకాతు పూర్తి చేసి, రెండవ సజ్దా తరువాత కూర్చుని తషహ్హుద్ లోని రెండవ భాగాన్ని పఠించి, సలాము పలుకుతూ సలాహ్ ను పూర్తి చేయవలెను.)
27 - అలా ప్రశాంతంగా కూర్చుని, తషహ్హుద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయవలెను.
28 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
జవాబు: మూడు సార్లు అస్'తగ్'ఫిరుల్లాహ్ (ఓ అల్లాహ్ నన్ను క్షమించు) అని పలకాలి.
అల్లాహుమ్మ అంత'స్సలాము, వ మిన్'కస్సలాము. తబారక్'త యా జల్'జలాలి వల్'ఇక్రామ్ (ఓ అల్లాహ్ నీవు శాంతి ప్రధాతవు, నీ వద్ద నుండే శాంతి ప్రాప్తిస్తుంది. ఓ వైభవోపేత, గౌరవోన్నతుడా సకల శుభాలు కలవాడవు నీవే).
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్'దహు లా షరీకలహు, లహుల్ ముల్కు వలహుల్'హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత, వలా ము'అ'తియ లిమా మనఆత, వలా యన్'ఫఉ జల్ జద్ది మిన్'కల్ జద్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును,ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు). (మూడు సార్లు)
లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు, లహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వలా న'ఆబుదు ఇల్లాహ్ ఇయ్యాహు, లహున్నేమతు వలహుల్ ఫద్'ల్, వ లహుస్సనాఉల్ హసన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన వ లౌ కరిహల్ కాఫిరూన్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ ప్రసాదించిన శక్తి సామర్థ్యాలు తప్ప మరేది లేదు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. అనుగ్రహాలు ఆయనవే. కృపావరములు ఆయనవే. మంచి పొగడ్తలు ఆయనకే సొంతం. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. చిత్తశుద్ధితో మా ఆరాధనలను ఆయనకే అంకితం చేస్తాము. తిరస్కారులకు అది ఎంతగా సహించరానిదైనా సరే).
సుబహానల్లాహ్ ముప్పై మూడు సార్లు.
అల్ హమ్'దులిల్లాహ్ ముప్పై మూడు సార్లు.
అల్లాహు అక్బర్ ముప్పై మూడు సార్లు
చివరిగా దీనిని ముగిస్తూ, ఇలా పలుక వలెను: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లుహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు వహుల అలా కుల్లి షైయిన్ ఖదీర్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సర్వస్తోత్రాలన్ని ఆయనకే చెందుతాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు).
ఆ తరువాత ఫజ్ర్ మరియు మగ్రిబ్ సలాహ్ లలో సూరతుల్ ఇఖ్లాస్ (112వ సూరహ్) మూడు సార్లు, సూరతుల్ ఫలఖ్ మూడు సార్లు (113వ సూరహ్) మరియు సూరతున్నాస్ మూడు సార్లు (114వ సూరహ్) పఠించ వలెను. మిగతా సలాహ్ లలో ఒక్కొక్కసారి పఠించవలెను.
ఆ తరువాత ఒకసారి ఆయతుల్ కుర్సీ (2:255) పఠించ వలెను.
జవాబు: ఫజ్ర్ సలాహ్ కంటే ముందు రెండు రకాతులు
జొహర్ సలాహ్ కు ముందు నాలుగు రకాతులు (రెండు రెండు రకాతుల చొప్పున)
జొహర్ సలాహ్ తరువాత రెండు రకాతులు
మగ్రిబ్ సలాహ్ తరువాత రెండు రకాతులు
ఇషా సలాహ్ తరువాత రెండు రకాతులు
వాటి ఘనత: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా పలికారు: ఎవరైతే రాత్రింబవళ్ళలో పన్నెండు రకాతులు సలాహ్ చేస్తారో, వాని కోసం అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. రవాహు ముస్లిం వ అహ్మద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు
జవాబు: మొత్తం వారం దినాలలో జుమఅహ్ దినం ఉత్తమమైనది. నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీ దినాలలో అత్యంత శ్రేష్ఠమైన దినం శుక్రవారం; ఆ దినముననే ఆదమ్ సృష్టించబడ్డాడు, ఆ దినముననే అతను మరణించాడు, ఆ దినముననే చివరి (ప్రళయ) శంఖం ఊదబడుతుంది, ఆ దినముననే (ప్రళయ) ఆర్తనాదాలు వినబడతాయి. కాబట్టి ఆ దినము నాపై మరింత ఎక్కువగా దరూద్ పంపండి, ఎందుకంటే మీ దరూద్ లు నాకు సమర్పించబడతాయి. దానికి ప్రజలు ఇలా అడిగారు: ఓ రసూలుల్లాహ్, మీ భౌతిక శరీరం కుళ్ళిపోయిన తరువాత కూడా మా దరూద్ లు మీకు ఎలా చేరతాయి? అపుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు: నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తల శరీరాలు కుళ్ళకుండా భూమిని నిషేధించాడు. రవాహు అబూ దావూద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు
జవాబు: ఇది యుక్తవయస్సుకు చేరిన, మతిస్థిమితం కలిగిఉన్న, స్థిరంగా ఒకచోట నివాసం ఉంటున్న ప్రతి ముస్లిం పురుషుడిపై తప్పనిసరి వ్యక్తిగత విధి.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు సలాహ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి, అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకో గలిగితే అది మీకు ఎంతో ఉత్తమమైనది. [సూరతుల్ మునాఫిఖూన్: 9వ ఆయతు]
జవాబు:
1 - గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేయడం
2 - అత్తరు పూసుకోవడం
3 - మంచి దుస్తులు ధరించడం
4 - ముందుగానే మస్జిదుకు వెళ్ళడం
5 - వీలయినంత ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపడం
6 - సూరతుల్ కహఫ్ పారాయణం
7 - మస్జిదుకు కాలినడకన వెళ్ళడం
8 - దుఆలు ఎక్కువగా ఆమోదించబడే అవకాశం ఉన్న ఘడియను అన్వేషించడం (ఆ ఘడియ దుఆలలో గడపడం).
జవాబు: మనస్సును, శరీరాన్ని స్థిమితంగా, ప్రశాంతంగా హాజరు పరచి, పూర్తి ఏకాగ్రతతో, అణుకువ, వినమ్రతతో, విధేయతతో (బయటి ప్రపంచాన్ని మరచి) సలాహ్ (నమాజు)లో లీనమై పోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;1 వారే! ఎవరైతే తమ సలాహ్ లో ఖుషు (వినమ్రత) పాటిస్తారో!2 [సూరతుల్ మోమినూన్ : 1-2వ ఆయతులు]
జవాబు: ఇది ఒక నిర్దిష్ట రకమైన ఆస్తిపై, ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడే ఆర్థిక హక్కు. ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి మరియు తప్పనిసరిగా ధనవంతుల నుండి తీసుకోబడి, పేదలకు అందించబడే విధి దానం.
ఇది ఒక నిర్దిష్ట రకమైన ఆస్తిపై, ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడే ఆర్థిక హక్కు. ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి మరియు తప్పనిసరిగా ధనవంతుల నుండి తీసుకోబడి, పేదలకు అందించబడే విధి దానం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: {మరియు మీరు జకాత్ చెల్లించండి}. [సూరతుల్ బఖరహ్: 43వ ఆయతు]
జవాబు: ఉపవాసం పాటించాలనే సంకల్పంతో, తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని నిర్వీర్యం చేసే వాటన్నింటి నుండి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ను ఆరాధించడం. ఇది రెండు రకాలు:
మొదటిది: సియాము వాజిబ్ అంటే విధిగావించబడిన తప్పనిసరి ఉపవాసాలు: ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటైన రమదాన్ నెల ఉపవాసాల వంటివి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! ఉపవాసం మీ కొరకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడిందో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!} (183) [సూరతుల్ బఖరహ్: 183వ ఆయతు]
రెండవది: స్వచ్ఛంద ఉపవాసం: సోమవారం మరియు గురువారాల్లో ఉపవాసం; ప్రతి నెలా మూడు రోజుల ఉపవాసం, వీటిలో ఉత్తమమైనవి ప్రతి చంద్రమాన నెలలో తెల్లటి దినాల ఉపవాసాలు (13, 14, 15) మొదలైన తప్పనిసరి విధిగావించ బడని ఉపవాసాలు.
జవాబు: అబీ సయీద్ అల్ ఖుద్'రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ దాసుడైతే అల్లాహ్ మార్గంలో ఒక దినము ఉపవాసం ఉంటారో, అల్లాహ్ ఆ దినము ఉపవాసానికి బదులుగా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై శరదృతువులంత (సంవత్సరాలంత) దూరంగా ఉంచుతాడు. ముత్తఫఖున్ అలైహి
డెబ్బై శరదృతువులు అంటే డెబ్బై సంవత్సరాలు అని అర్థం
జవాబు: 1 - సమయం కాగానే ఉపవాసాన్ని విరమించడంలో త్వరపడటం.
2 - తెల్లవారుజామున ఉపవాసం ప్రారంభించ వలసిన సమయం వరకు ముందు వరకు ఆగి, అప్పుడు సహరీ భోజనం చేయడం.
3 - మంచిపనులు మరియు అల్లాహ్ ఆరాధనలు అధికంగా చేయడం
4 - ఒకవేళ ఎవరైనా మీతో జగడం మొదలు పెడితే, వారితో "నేను ఉపవాసం పాటిస్తున్నాను" అని పలికి అతనితో తగవులాట నుండి దూరంగా ఉండటం
5 - ఉపవాసం విరమించే సమయంలో (ఇఫ్తార్ సమయంలో) దుఆ చేయడం
6 - అప్పుడే కోసిన ఖర్జూరపు పండ్లతో లేదా మామూలు ఖర్జూరపు పండ్లతో ఉపవాసాన్ని విరమించడం. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే, మంచినీళ్ళతో ఉపవాసాన్ని విరమించడం.
జవాబు: హజ్ అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను “నిర్ణీత సమయంలో నిర్దిష్ట ఆచారాలు పాటిస్తూ మక్కా నగరంలోని ఆయన పవిత్ర గృహాన్ని సందర్శించిడం” ద్వారా ఆరాధించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు హజ్ యాత్ర చేసే స్తోమత కలిగి ఉన్నవారు, అల్లాహ్ కొరకు అల్లాహ్ గృహ సందర్శన చేయవసలసి ఉంది; మరియు ఎవరైతే తిరస్కరించాడో నిశ్చయంగా అల్లాహ్ సర్వలోకాల కంటే చాలా సుసంపన్నుడు'}[97] [సూరతు ఆలే ఇమ్రాన్ : 97 ఆయతు]
జవాబు: అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా విన్నానని తెలిపారు:- ఎవరైతే అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ హజ్జ్ యాత్రను పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా మరలుతాడు. రవాహు అల్ బుఖారీ, ముస్లిం మరియు ఇతర హదీసు గ్రంధాలు.
క యౌమ వలదతహు ఉమ్ముహు (తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా) అంటే పాపరహితుడిగా, పవిత్రంగా అని అర్థం.
జవాబు: దీని అర్థం, సత్యాన్ని కాపాడటంలో, ఇస్లాంను వ్యాపింపజేస్తూ మరియు దాని ప్రజలను శత్రువుల బారి నుండి రక్షించడంలో, ఇస్లాం మరియు ముస్లింల బద్ధశత్రువులతో వారి దాడిని ఎదుర్కొంటూ ధర్మపోరాటం చేయడంలో అత్యంత కృషి చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది. [సూరతు అత్తౌబా: 6వ ఆయతు]